ప్రభన్యూస్

New Movies: సినిమా లవర్స్‌కు వినోదాల విందు.. అఖిల్ లెనిన్‌తో పాటు ఈ వారం రిలీజ్ అవుతున్న టాప్ చిత్రాలు ఇవే! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

జూలై రెండో వారంలో థియేటర్లలో ‘లెనిన్’, ‘ఐ, నోబడీ’ వంటి క్రేజీ చిత్రాలు విడుదల కానుండగా, ఓటీటీలో కూడా బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. సినిమా అభిమానులకు ఈ వారం పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది.

News18
News18

సినిమా ప్రియులకు జూలై రెండో వారం భారీ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. అటు థియేటర్లలో వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిత్రాలు, ఇటు ఓటీటీలో క్రేజీ బ్లాక్‌బస్టర్లు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి లైనప్‌లో ఉన్నాయి. మరి ఈ వారం (జూలై 7 నుంచి జూలై 13 వరకు) ఎక్కడ, ఏ సినిమా సందడి చేయబోతుందో ఓ లుక్కేద్దాం.

1. లెనిన్ (Lenin):

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు అంచనాలను పెంచాయి. “సీమ నేపథ్యంలో సాగే మహాభారతమే ఈ లెనిన్ చిత్రం” అని ఆయన పేర్కొనడంతో ఈ యాక్షన్ డ్రామాపై అందరి దృష్టి పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

2. ఐ, నోబడీ (I, Nobody):

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’. నిస్సాం బషీర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటించారు. ఒక సాదాసీదా బ్యాంక్ ఉద్యోగి జీవితంలో ఎదురైన ఊహించని సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మలయాళంలో జులై 9న విడుదలవుతుండగా, తెలుగు ప్రేక్షకులకు జులై 10న ఈ థ్రిల్లర్ అందుబాటులోకి రానుంది.

3. ఈవిల్ డెడ్ బర్న్:

ప్రపంచవ్యాప్తంగా హారర్ ప్రియులను భయపెట్టే విజువల్స్ ఉన్న ‘ఈవిల్ డెడ్’ సిరీస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘ఈవిల్ డెడ్ బ‌ర్న్’. సెబాస్టియన్ వానిచెక్ దర్శకత్వంలో ఒళ్లు జలదరించే సన్నివేశాలతో రూపొందిన ఈ హారర్ మూవీ జులై 10న ఇంగ్లీష్‌తో పాటు ప్రముఖ ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

4. వసుదేవసుతం:

మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘వసుదేవసుతం’. ఒడిశాలోని ఒక పురాతన వాసుదేవుని ఆలయం, అక్కడ దాగి ఉన్న రహస్య ‘బ్రహ్మ పదార్థం’ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ పవిత్ర పదార్థాన్ని దక్కించుకోవాలని చూసే శత్రువుల నుంచి హీరో ఆలయాన్ని ఎలా కాపాడాడు అనేది జులై 10న థియేటర్లలో చూడాల్సిందే.

5. లవ్ ఓ లవ్:

పవిష్ నారాయణన్, తెలుగు నటి నాగదుర్గ ప్రధాన పాత్రల్లో మహేష్ రాజేంద్రన్ తెరకెక్కించిన న్యూ-ఏజ్ లవ్ డ్రామా ‘లవ్ ఓ లవ్’. సాధారణంగా అమ్మాయిల ప్రేమ కోసం అబ్బాయిలు పడే కష్టాలను చూపిస్తుంటారు, కానీ ఇందులో ఒక అబ్బాయి మనసు గెలవడానికి అమ్మాయి చేసే ప్రయత్నాలను వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా చూపించనున్నారు. ఈ చిత్రం జులై 10న రిలీజ్ కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 July 2026, 10:41 pm Digital Edition : Prabhanews
New Movies: సినిమా లవర్స్‌కు వినోదాల విందు.. అఖిల్ లెనిన్‌తో పాటు ఈ వారం రిలీజ్ అవుతున్న టాప్ చిత్రాలు ఇవే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 06, 2026 7:25 PM ISTజూలై రెండో వారంలో థియేటర్లలో 'లెనిన్', 'ఐ, నోబడీ' వంటి క్రేజీ చిత్రాలు విడుదల కానుండగా, ఓటీటీలో కూడా బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. సినిమా అభిమానులకు ఈ వారం పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది.
News18సినిమా ప్రియులకు జూలై రెండో వారం భారీ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. అటు థియేటర్లలో వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిత్రాలు, ఇటు ఓటీటీలో క్రేజీ బ్లాక్‌బస్టర్లు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి లైనప్‌లో ఉన్నాయి. మరి ఈ వారం (జూలై 7 నుంచి జూలై 13 వరకు) ఎక్కడ, ఏ సినిమా సందడి చేయబోతుందో ఓ లుక్కేద్దాం.1. లెనిన్ (Lenin):అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం 'లెనిన్'. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు అంచనాలను పెంచాయి. "సీమ నేపథ్యంలో సాగే మహాభారతమే ఈ లెనిన్ చిత్రం" అని ఆయన పేర్కొనడంతో ఈ యాక్షన్ డ్రామాపై అందరి దృష్టి పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.2. ఐ, నోబడీ (I, Nobody):మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ 'ఐ, నోబడీ'. నిస్సాం బషీర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటించారు. ఒక సాదాసీదా బ్యాంక్ ఉద్యోగి జీవితంలో ఎదురైన ఊహించని సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మలయాళంలో జులై 9న విడుదలవుతుండగా, తెలుగు ప్రేక్షకులకు జులై 10న ఈ థ్రిల్లర్ అందుబాటులోకి రానుంది.3. ఈవిల్ డెడ్ బర్న్:ప్రపంచవ్యాప్తంగా హారర్ ప్రియులను భయపెట్టే విజువల్స్ ఉన్న 'ఈవిల్ డెడ్' సిరీస్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'ఈవిల్ డెడ్ బ‌ర్న్'. సెబాస్టియన్ వానిచెక్ దర్శకత్వంలో ఒళ్లు జలదరించే సన్నివేశాలతో రూపొందిన ఈ హారర్ మూవీ జులై 10న ఇంగ్లీష్‌తో పాటు ప్రముఖ ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.4. వసుదేవసుతం:మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 'వసుదేవసుతం'. ఒడిశాలోని ఒక పురాతన వాసుదేవుని ఆలయం, అక్కడ దాగి ఉన్న రహస్య 'బ్రహ్మ పదార్థం' చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ పవిత్ర పదార్థాన్ని దక్కించుకోవాలని చూసే శత్రువుల నుంచి హీరో ఆలయాన్ని ఎలా కాపాడాడు అనేది జులై 10న థియేటర్లలో చూడాల్సిందే.5. లవ్ ఓ లవ్:పవిష్ నారాయణన్, తెలుగు నటి నాగదుర్గ ప్రధాన పాత్రల్లో మహేష్ రాజేంద్రన్ తెరకెక్కించిన న్యూ-ఏజ్ లవ్ డ్రామా 'లవ్ ఓ లవ్'. సాధారణంగా అమ్మాయిల ప్రేమ కోసం అబ్బాయిలు పడే కష్టాలను చూపిస్తుంటారు, కానీ ఇందులో ఒక అబ్బాయి మనసు గెలవడానికి అమ్మాయి చేసే ప్రయత్నాలను వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా చూపించనున్నారు. ఈ చిత్రం జులై 10న రిలీజ్ కానుంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link