నాటుకోడి మాంసం: అర కిలో (శుభ్రం చేసినది)
ఉల్లిపాయలు: 2 (సన్నటి తరుగు)
టమోటాలు: 2 (ముక్కలు)
పచ్చిమిరపకాయలు: 3 (చీల్చినవి)
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర పెద్ద చెంచా
పసుపు: అర చిన్న చెంచా
కారం పొడి: 2 పెద్ద చెంచాలు (ఘాటుకు తగినట్లు)
నూనె: 3-4 పెద్ద చెంచాలు
కొత్తిమీర తరుగు: పావు కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
మసాలా ముద్ద కోసం (వేపి రుబ్బుకోవాలి):
ధనియాలు: 2 పెద్ద చెంచాలు
ఎండు కొబ్బరి ముక్కలు: పావు కప్పు
దాల్చిన చెక్క: 2 చిన్న ముక్కలు
లవంగాలు: 4-5
యాలకులు: 2
గసగసాలు: 1 చిన్న చెంచా
మిరియాలు: అర చిన్న చెంచా
జీలకర్ర: 1 చిన్న చెంచా
బాణలిలో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు (ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి) దోరగా వేయించి చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి ముద్దలా రుబ్బుకోండి. కుక్కర్‌లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేపండి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా వేయించండి. ఇప్పుడు నాటుకోడి ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. మూతపెట్టి చిన్న మంటపై ముక్కల్లోని నీరంతా ఊరేవరకు 5-7 నిమిషాలు మగ్గనివ్వండి. టమోటా ముక్కలు, కారం పొడి, ముందుగా నూరిపెట్టుకున్న మసాలా ముద్ద వేసి నూనె తేలేవరకు కలపండి. ఆ తర్వాత ముక్కలు మునిగేలా సరిపడా నీళ్లు (సుమారు 2-3 కప్పులు) పోసి కలపండి. నాటుకోడి ఉడకడానికి సమయం పడుతుంది కాబట్టి కుక్కర్ మూతపెట్టి విజిల్ ఉంచి మీడియం మంటపై 5 నుండి 6 కూతలు రానివ్వండి. ఆవిరి పోయాక మూతతీసి కొత్తిమీర చల్లి రెండు నిమిషాలు చిన్న మంటపై మరిగించి దించేయండి.
రాగి పిండి: 1 కప్పు
బియ్యం: పావు కప్పు (సోనా మసూరి లేదా రేషన్ బియ్యం)
నీళ్లు: రెండున్నర కప్పులు
ఉప్పు: చిటికెడు
నెయ్యి: 1 చిన్న చెంచా
అన్నం మెత్తగా ఉడికించడం: పాత్రలో నీళ్లు పోసి, ఉప్పు, కడిగిన బియ్యం వేసి స్టవ్ మీద పెట్టండి. అన్నం బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక, మంటను పూర్తిగా తగ్గించి, రాగి పిండిని అన్నం పైన సమానంగా చల్లండి. వెంటనే కలపకుండా మూతపెట్టి 3-4 నిమిషాలు ఆవిరిపై అలాగే ఉంచండి. ఇప్పుడు పప్పుగుత్తి వెనుక భాగంతో లేదా గరిటెతో పిండి, అన్నం ఉండలు లేకుండా గట్టిగా కలపండి. పిండి అంతా కలిసి ముద్దగా మారేలా బాగా తిప్పాలి. చివరగా ఒక చెంచా నెయ్యి చల్లి మూతపెట్టి, చాలా చిన్న మంటపై 2 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేయండి. చేతికి లేదా ఒక గుంట గిన్నెకు కొద్దిగా నీటి తడి రాసుకుని, వేడివేడి రాగి మిశ్రమాన్ని అందులో వేసి గుండ్రటి ముద్దలుగా చుట్టండి.
అంత రెడీ అయ్యాక.. పళ్ళెంలో వేడివేడి రాగిముద్దను ఉంచి, మధ్యలో గుంట చేసి నెయ్యి వేసి, పక్కన ఘాటైన నాటుకోడి పులుసు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మచెక్కతో వడ్డిస్తే రాయలసీమ రుచి పరిపూర్ణం.
