ప్రభన్యూస్

Narnia Movie: ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసిందిరోయ్.. ఆ విజువల్స్ ఏంట్రా బాబూ.. మైండ్ పోతుంది లోపల..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఫాంటసీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ‘బార్బీ’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

News18
News18

ఫాంటసీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ‘బార్బీ’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మాయాజాలం, వింత జీవులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, అద్భుతమైన ప్రపంచంతో ప్రేక్షకులను కొత్త అనుభూతికి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సీ.ఎస్. లూయిస్ రాసిన ప్రసిద్ధ పుస్తకాల ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫాంటసీ మూవీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో నార్నియా అనే మాయా ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు చిన్నారుల ప్రయాణం కథలో కీలకంగా ఉండనుంది. డేవిడ్ మెక్‌కెన్నా డిగరీ కిర్క్ పాత్రలో, బీట్రైస్ క్యాంప్‌బెల్ పాలీ ప్లమ్మర్ పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి ప్రయాణం నార్నియా ప్రపంచానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను పరిచయం చేయనుంది. ట్రైలర్‌లో చూపించిన ఫాంటసీ అంశాలు, పాత్రల రూపకల్పన, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో ఎమ్మా మాకీ కనిపించనున్నారు. ఆమె యువ జాడిస్ పాత్రను పోషిస్తున్నారు. ఇక ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ అంకుల్ ఆండ్రూ పాత్రలో నటిస్తున్నారు. కేరీ ముల్లిగన్, కోబ్నా హోల్డ్‌బ్రూక్-స్మిత్, మెరిల్ స్ట్రీప్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ప్రతిభావంతులైన నటీనటులతో పాటు గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

గ్రెటా గెర్విగ్ గతంలో తెరకెక్కించిన ‘బార్బీ’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆమె నార్నియా వంటి ప్రసిద్ధ ఫాంటసీ ప్రపంచాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో డిగరీ, పాలీ, జాడిస్ పాత్రలను పరిచయం చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఈ పాత్రల ప్రయాణం, కథా నేపథ్యంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే సినిమా కథలోని కీలక మలుపులు, నార్నియా ప్రపంచం వెనుక ఉన్న రహస్యాలు వెండితెరపై ఎలా ఆవిష్కృతమవుతాయో చూడాలి.

సీ.ఎస్. లూయిస్ రచించిన ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ సిరీస్‌లో ‘ది మెజీషియన్స్ నెఫ్యూ’ ప్రచురణ క్రమంలో ఆరో పుస్తకం. కానీ కథాక్రమం ప్రకారం ఇది ‘ది లయన్, ది విచ్ అండ్ ది వార్డ్‌రోబ్’కు ముందు జరిగే సంఘటనలను వివరిస్తుంది. నార్నియా అనే అద్భుత ప్రపంచం ఎలా పుట్టుకొచ్చింది? దాని వెనుక ఉన్న మాయాజాలం ఏమిటి? అనే అంశాలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి.

నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ పంపిణీ చేస్తోంది. ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ 2027 ఫిబ్రవరి 12న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 5:11 pm Digital Edition : Prabhanews
Narnia Movie: ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసిందిరోయ్.. ఆ విజువల్స్ ఏంట్రా బాబూ.. మైండ్ పోతుంది లోపల..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 16, 2026 4:30 PM ISTఫాంటసీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ‘బార్బీ’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. News18ఫాంటసీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ‘బార్బీ’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మాయాజాలం, వింత జీవులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, అద్భుతమైన ప్రపంచంతో ప్రేక్షకులను కొత్త అనుభూతికి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సీ.ఎస్. లూయిస్ రాసిన ప్రసిద్ధ పుస్తకాల ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫాంటసీ మూవీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.తాజాగా విడుదలైన ట్రైలర్‌లో నార్నియా అనే మాయా ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు చిన్నారుల ప్రయాణం కథలో కీలకంగా ఉండనుంది. డేవిడ్ మెక్‌కెన్నా డిగరీ కిర్క్ పాత్రలో, బీట్రైస్ క్యాంప్‌బెల్ పాలీ ప్లమ్మర్ పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి ప్రయాణం నార్నియా ప్రపంచానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను పరిచయం చేయనుంది. ట్రైలర్‌లో చూపించిన ఫాంటసీ అంశాలు, పాత్రల రూపకల్పన, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో ఎమ్మా మాకీ కనిపించనున్నారు. ఆమె యువ జాడిస్ పాత్రను పోషిస్తున్నారు. ఇక ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ అంకుల్ ఆండ్రూ పాత్రలో నటిస్తున్నారు. కేరీ ముల్లిగన్, కోబ్నా హోల్డ్‌బ్రూక్-స్మిత్, మెరిల్ స్ట్రీప్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ప్రతిభావంతులైన నటీనటులతో పాటు గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.గ్రెటా గెర్విగ్ గతంలో తెరకెక్కించిన ‘బార్బీ’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆమె నార్నియా వంటి ప్రసిద్ధ ఫాంటసీ ప్రపంచాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో డిగరీ, పాలీ, జాడిస్ పాత్రలను పరిచయం చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఈ పాత్రల ప్రయాణం, కథా నేపథ్యంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే సినిమా కథలోని కీలక మలుపులు, నార్నియా ప్రపంచం వెనుక ఉన్న రహస్యాలు వెండితెరపై ఎలా ఆవిష్కృతమవుతాయో చూడాలి.సీ.ఎస్. లూయిస్ రచించిన ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ సిరీస్‌లో ‘ది మెజీషియన్స్ నెఫ్యూ’ ప్రచురణ క్రమంలో ఆరో పుస్తకం. కానీ కథాక్రమం ప్రకారం ఇది ‘ది లయన్, ది విచ్ అండ్ ది వార్డ్‌రోబ్’కు ముందు జరిగే సంఘటనలను వివరిస్తుంది. నార్నియా అనే అద్భుత ప్రపంచం ఎలా పుట్టుకొచ్చింది? దాని వెనుక ఉన్న మాయాజాలం ఏమిటి? అనే అంశాలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి.నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ పంపిణీ చేస్తోంది. ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ 2027 ఫిబ్రవరి 12న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.మరింత చదవండి

Source link