నెలకు రూ.25,000 జీతం పొందే వ్యక్తి రూ.కోటి నిధిని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అనుకుందాం. వార్షికంగా 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేసి, మ్యూచువల్ ఫండ్లో నెలకు రూ.4,000 చొప్పున పెట్టుబడి పెడితే, రూ.కోటి చేరుకోవడానికి సుమారు 339 నెలలు, అంటే 28 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అదే నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దాదాపు 317 నెలలు లేదా 26 ఏళ్లకు పైగా పడుతుంది.

