Last Updated:
కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్లు ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకు జరుగుతాయి. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు.
ఎంబీఏ, ఎంసీఏ చదవాలనుకుని.. ఐసెట్ కౌన్సెలింగ్లో సీటు దక్కక ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరో అవకాశం వచ్చింది. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న యూనివర్సిటీ పీజీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. దీంతో పీజీ మేనేజ్మెంట్, కంప్యూటర్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

