Jobs: CBIలో ఉద్యోగం ఎలా పొందాలి? ఏ పరీక్ష రాయాలి? నెలకు ఎంత జీతం వస్తుంది? |


సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ప్రముఖ దర్యాప్తు సంస్థ. ఇది కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అందువల్ల ఇక్కడి ఉద్యోగాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణించబడతాయి. మంచి వేతనం, గౌరవం, ఉద్యోగ భద్రతతో పాటు సమాజానికి సేవ చేసే అవకాశం కూడా ఈ ఉద్యోగాల్లో ఉంటుంది.

సీబీఐలో ఉద్యోగానికి ప్రత్యేక పరీక్ష ఉండదు

సీబీఐలో చేరడానికి ప్రత్యేకంగా వేరే పరీక్ష నిర్వహించరు. దేశంలోని ప్రధాన పోటీ పరీక్షల ద్వారా ఈ సంస్థలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా మూడు మార్గాల ద్వారా సీబీఐలో ప్రవేశించే అవకాశం ఉంటుంది.

మొదటిది ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ (SSC CGL) పరీక్ష. ఈ పరీక్ష ద్వారా సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) వంటి పోస్టులకు ఎంపిక జరుగుతుంది. ముఖ్యంగా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఎస్‌ఎస్‌సీ ప్రతి ఏడాది నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతాయి.

రెండో మార్గం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సేవల్లో ఎంపికైన అధికారులు డిప్యుటేషన్ ద్వారా సీబీఐలో ఎస్పీ, డైరెక్టర్ వంటి ఉన్నత పదవుల్లో పనిచేసే అవకాశం పొందుతారు.

మూడో మార్గం డిప్యుటేషన్ విధానం. రాష్ట్ర పోలీసు శాఖల్లో పనిచేస్తున్న సమర్థులైన అధికారులు లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను వారి అనుభవం, అర్హతల ఆధారంగా కొంతకాలం సీబీఐలో నియమిస్తారు.

అర్హతలు ఏంటి?

సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు సాధారణంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే శారీరక దారుఢ్యం కూడా తప్పనిసరి.

జీతం ఎంత ఉంటుంది?

సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టు గ్రేడ్-బి గెజిటెడ్ హోదాకు చెందుతుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రారంభ దశలోనే నెలకు సుమారు రూ.70,000 నుంచి రూ.90,000 వరకు చేతికి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో పలు రకాల అలవెన్సులు, రిస్క్ అలవెన్సులు కూడా ఉంటాయి.

అవసరమైన నైపుణ్యాలు

సీబీఐలో పనిచేయాలంటే కేవలం విద్యార్హతలు సరిపోవు. వేగంగా ఆలోచించే సామర్థ్యం, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, విశ్లేషణాత్మక దృష్టి, సైబర్ నేరాలపై ప్రాథమిక అవగాహన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ముఖ్యంగా పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటే దర్యాప్తులో ఉన్న కేసులను వేగంగా ఛేదించే అవకాశం ఉంటుంది. అందుకే సీబీఐలో ఉద్యోగం సాధించాలనుకునే వారు పోటీ పరీక్షలతో పాటు వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 7:13 pm Digital Edition : Prabhanews
Jobs: CBIలో ఉద్యోగం ఎలా పొందాలి? ఏ పరీక్ష రాయాలి? నెలకు ఎంత జీతం వస్తుంది? |

సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ప్రముఖ దర్యాప్తు సంస్థ. ఇది కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అందువల్ల ఇక్కడి ఉద్యోగాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణించబడతాయి. మంచి వేతనం, గౌరవం, ఉద్యోగ భద్రతతో పాటు సమాజానికి సేవ చేసే అవకాశం కూడా ఈ ఉద్యోగాల్లో ఉంటుంది.సీబీఐలో ఉద్యోగానికి ప్రత్యేక పరీక్ష ఉండదుసీబీఐలో చేరడానికి ప్రత్యేకంగా వేరే పరీక్ష నిర్వహించరు. దేశంలోని ప్రధాన పోటీ పరీక్షల ద్వారా ఈ సంస్థలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా మూడు మార్గాల ద్వారా సీబీఐలో ప్రవేశించే అవకాశం ఉంటుంది.మొదటిది ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ (SSC CGL) పరీక్ష. ఈ పరీక్ష ద్వారా సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) వంటి పోస్టులకు ఎంపిక జరుగుతుంది. ముఖ్యంగా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఎస్‌ఎస్‌సీ ప్రతి ఏడాది నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతాయి.రెండో మార్గం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సేవల్లో ఎంపికైన అధికారులు డిప్యుటేషన్ ద్వారా సీబీఐలో ఎస్పీ, డైరెక్టర్ వంటి ఉన్నత పదవుల్లో పనిచేసే అవకాశం పొందుతారు.మూడో మార్గం డిప్యుటేషన్ విధానం. రాష్ట్ర పోలీసు శాఖల్లో పనిచేస్తున్న సమర్థులైన అధికారులు లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను వారి అనుభవం, అర్హతల ఆధారంగా కొంతకాలం సీబీఐలో నియమిస్తారు.అర్హతలు ఏంటి?సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు సాధారణంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే శారీరక దారుఢ్యం కూడా తప్పనిసరి.జీతం ఎంత ఉంటుంది?సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టు గ్రేడ్-బి గెజిటెడ్ హోదాకు చెందుతుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రారంభ దశలోనే నెలకు సుమారు రూ.70,000 నుంచి రూ.90,000 వరకు చేతికి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో పలు రకాల అలవెన్సులు, రిస్క్ అలవెన్సులు కూడా ఉంటాయి.అవసరమైన నైపుణ్యాలుసీబీఐలో పనిచేయాలంటే కేవలం విద్యార్హతలు సరిపోవు. వేగంగా ఆలోచించే సామర్థ్యం, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, విశ్లేషణాత్మక దృష్టి, సైబర్ నేరాలపై ప్రాథమిక అవగాహన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ముఖ్యంగా పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటే దర్యాప్తులో ఉన్న కేసులను వేగంగా ఛేదించే అవకాశం ఉంటుంది. అందుకే సీబీఐలో ఉద్యోగం సాధించాలనుకునే వారు పోటీ పరీక్షలతో పాటు వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలి.

Source link