ప్రభన్యూస్

హైదరాబాద్ స్టార్టప్‌కి భారీ ఫండింగ్… ఏకంగా 9 మిలియన్ డాలర్లు.. ఇక 5 లక్షల మంది విద్యార్థులకు టెక్, ఏఐ స్కిల్స్! | బిజినెస్


సోదరులు కరుణ్ తాడేపల్లి, శ్రీచరణ్ తాడేపల్లి ప్రారంభించిన బైట్‌ఎక్స్‌ఎల్ ఇంజినీరింగ్ కాలేజీలతో కలిసి పనిచేస్తోంది. కాలేజీ చదువులోనే పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీ, ఏఐపై ప్రాక్టికల్ లెర్నింగ్ అందిస్తూ, విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని కాలేజీలపై దృష్టి పెట్టిన సంస్థ, స్కిల్లింగ్‌ను అదనపు ట్రైనింగ్‌గా కాకుండా విద్యలోనే భాగంగా అందిస్తోంది. గత ఏడాది బైట్‌ఎక్స్‌ఎల్‌కు చెందిన 7,600 మంది విద్యార్థులకు ఐటీ, ఇంజినీరింగ్ ఉద్యోగాలు లభించాయి.

ఎలివార్ ఈక్విటీ ఫౌండర్, మేనేజింగ్ పార్ట్‌నర్ సందీప్ ఫారియాస్ మాట్లాడుతూ, టైర్-2, టైర్-3 ప్రాంతాల్లోని కుటుంబాలకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కీలకమని అన్నారు. కాలేజీల వ్యవస్థలోనే బైట్‌ఎక్స్‌ఎల్ తన మోడల్‌ను అమలు చేస్తుండటం తమను ఆకట్టుకుందని చెప్పారు. మెట్రో నగరాలకు బయట కొత్త తరం టెక్ టాలెంట్‌ను తయారు చేసే పెద్ద స్థాయి ప్లాట్‌ఫామ్‌గా ఎదిగే అవకాశం సంస్థకు ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: SBI Solar Loan: కరెంట్ బిల్, పాన్ కార్డ్ ఉంటే మీ ఇంటిపై సోలార్ కోసం రూ.6 లక్షల వరకు లోన్

ది మైఖేల్ & సుసాన్ డెల్ ఫౌండేషన్, ఇండియా యూనివర్సిటీ సక్సెస్ హెడ్ గౌరవ్ జైన్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు ఇంజినీరింగ్ డిగ్రీ మంచి ఉద్యోగం, మెరుగైన ఆర్థిక భవిష్యత్తుకు మార్గంగా ఉంటుందని చెప్పారు. టైర్-2, టైర్-3 నగరాల్లోని ఇంజినీరింగ్ కాలేజీలతో బైట్‌ఎక్స్‌ఎల్ చేస్తున్న పని ముఖ్యమని తెలిపారు.

కలారీ క్యాపిటల్ పార్ట్‌నర్ సంపత్ పి మాట్లాడుతూ, బైట్‌ఎక్స్‌ఎల్‌లో ఇది తమ రెండో పెట్టుబడి రౌండ్ అని చెప్పారు. సంస్థ ప్రత్యేకత దాని మోడల్, స్వంత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లో ఉందని తెలిపారు. “ఇప్పటికే ఉన్న కాలేజీ వ్యవస్థలోనే పనిచేస్తూ, పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీ విద్యను విద్యార్థుల నాలుగేళ్ల ఇంజినీరింగ్ ప్రయాణంలో భాగం చేయగలగడం సంస్థ ప్రత్యేకత” అని వివరించారు.

byteXL funding news, byteXL $9 million funding, byteXL latest funding round, AI skilling in India, engineering students job skills, tech education startups India, Tier 2 Tier 3 college jobs, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, కాలేజీ విద్యార్థులకు ఏఐ శిక్షణ, టెక్ స్కిల్స్ నేర్చుకునే అవకాశాలు, ఇంజినీరింగ్ కాలేజీల తాజా వార్తలు, విద్యార్థుల ఉద్యోగ నైపుణ్యాలు, ఏఐ కోర్సుల తాజా సమాచారం, ప్రైవేట్ ఉద్యోగాల కోసం స్కిల్స్

బైట్‌ఎక్స్‌ఎల్ కో-ఫౌండర్, సీఈఓ కరుణ్ తాడేపల్లి మాట్లాడుతూ, “ఈ ఫండింగ్ తమ సంస్థ సాధించిన వృద్ధికి, వ్యాపారం మీద ఇన్వెస్టర్లు పెట్టుకున్న నమ్మకానికి బలమైన గుర్తింపు” అని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు మరోసారి పెట్టుబడి పెట్టడం తమ అమలు సామర్థ్యంపై, ముందున్న అవకాశాలపై వారికి ఉన్న నమ్మకాన్ని చూపిస్తోందని తెలిపారు.

ఇది కూడా చదవండి: IRCTC Tour: అరుణాచలం నుంచి కన్యాకుమారి వరకు… రూ.15,800కే 9 రోజుల యాత్ర… ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ

తాజా నిధులతో మరిన్ని కాలేజీలకు చేరుకోవడంతో పాటు ఏఐ, టెక్నాలజీ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను బలోపేతం చేయాలని బైట్‌ఎక్స్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 40 విద్యాసంస్థల్లో ఉన్న సంస్థ, వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 120కి పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం 2 లక్షల మంది విద్యార్థులకు అందుతున్న సేవలను 15 రాష్ట్రాల్లో 5 లక్షల మంది విద్యార్థులకు విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. ఏఐ ఆధారిత లెర్నింగ్, అసెస్‌మెంట్, స్టూడెంట్ అనలిటిక్స్, వ్యక్తిగత అవసరాలకు తగ్గ లెర్నింగ్ టూల్స్ అభివృద్ధిపైనా పెట్టుబడి పెట్టనుంది.

బైట్‌ఎక్స్‌ఎల్ తాజా ఫండింగ్‌కు లోఎస్ట్రో అడ్వైజర్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా వ్యవహరించింది. దీనికి ముందు 2024 జూలైలో సంస్థ 5.9 మిలియన్ డాలర్ల సిరీస్-ఏ ఫండింగ్‌ను సమీకరించింది. తాజా 9 మిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా మరిన్ని ఇంజినీరింగ్ విద్యార్థులకు టెక్నాలజీ, ఏఐ నైపుణ్యాలను అందించి, వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసే తన మోడల్‌ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని బైట్‌ఎక్స్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 6:14 pm Digital Edition : Prabhanews
హైదరాబాద్ స్టార్టప్‌కి భారీ ఫండింగ్… ఏకంగా 9 మిలియన్ డాలర్లు.. ఇక 5 లక్షల మంది విద్యార్థులకు టెక్, ఏఐ స్కిల్స్! | బిజినెస్

సోదరులు కరుణ్ తాడేపల్లి, శ్రీచరణ్ తాడేపల్లి ప్రారంభించిన బైట్‌ఎక్స్‌ఎల్ ఇంజినీరింగ్ కాలేజీలతో కలిసి పనిచేస్తోంది. కాలేజీ చదువులోనే పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీ, ఏఐపై ప్రాక్టికల్ లెర్నింగ్ అందిస్తూ, విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని కాలేజీలపై దృష్టి పెట్టిన సంస్థ, స్కిల్లింగ్‌ను అదనపు ట్రైనింగ్‌గా కాకుండా విద్యలోనే భాగంగా అందిస్తోంది. గత ఏడాది బైట్‌ఎక్స్‌ఎల్‌కు చెందిన 7,600 మంది విద్యార్థులకు ఐటీ, ఇంజినీరింగ్ ఉద్యోగాలు లభించాయి.ఎలివార్ ఈక్విటీ ఫౌండర్, మేనేజింగ్ పార్ట్‌నర్ సందీప్ ఫారియాస్ మాట్లాడుతూ, టైర్-2, టైర్-3 ప్రాంతాల్లోని కుటుంబాలకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కీలకమని అన్నారు. కాలేజీల వ్యవస్థలోనే బైట్‌ఎక్స్‌ఎల్ తన మోడల్‌ను అమలు చేస్తుండటం తమను ఆకట్టుకుందని చెప్పారు. మెట్రో నగరాలకు బయట కొత్త తరం టెక్ టాలెంట్‌ను తయారు చేసే పెద్ద స్థాయి ప్లాట్‌ఫామ్‌గా ఎదిగే అవకాశం సంస్థకు ఉందని తెలిపారు.ఇది కూడా చదవండి: SBI Solar Loan: కరెంట్ బిల్, పాన్ కార్డ్ ఉంటే మీ ఇంటిపై సోలార్ కోసం రూ.6 లక్షల వరకు లోన్ది మైఖేల్ & సుసాన్ డెల్ ఫౌండేషన్, ఇండియా యూనివర్సిటీ సక్సెస్ హెడ్ గౌరవ్ జైన్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు ఇంజినీరింగ్ డిగ్రీ మంచి ఉద్యోగం, మెరుగైన ఆర్థిక భవిష్యత్తుకు మార్గంగా ఉంటుందని చెప్పారు. టైర్-2, టైర్-3 నగరాల్లోని ఇంజినీరింగ్ కాలేజీలతో బైట్‌ఎక్స్‌ఎల్ చేస్తున్న పని ముఖ్యమని తెలిపారు.కలారీ క్యాపిటల్ పార్ట్‌నర్ సంపత్ పి మాట్లాడుతూ, బైట్‌ఎక్స్‌ఎల్‌లో ఇది తమ రెండో పెట్టుబడి రౌండ్ అని చెప్పారు. సంస్థ ప్రత్యేకత దాని మోడల్, స్వంత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లో ఉందని తెలిపారు. "ఇప్పటికే ఉన్న కాలేజీ వ్యవస్థలోనే పనిచేస్తూ, పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీ విద్యను విద్యార్థుల నాలుగేళ్ల ఇంజినీరింగ్ ప్రయాణంలో భాగం చేయగలగడం సంస్థ ప్రత్యేకత" అని వివరించారు.బైట్‌ఎక్స్‌ఎల్ కో-ఫౌండర్, సీఈఓ కరుణ్ తాడేపల్లి మాట్లాడుతూ, "ఈ ఫండింగ్ తమ సంస్థ సాధించిన వృద్ధికి, వ్యాపారం మీద ఇన్వెస్టర్లు పెట్టుకున్న నమ్మకానికి బలమైన గుర్తింపు" అని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు మరోసారి పెట్టుబడి పెట్టడం తమ అమలు సామర్థ్యంపై, ముందున్న అవకాశాలపై వారికి ఉన్న నమ్మకాన్ని చూపిస్తోందని తెలిపారు.ఇది కూడా చదవండి: IRCTC Tour: అరుణాచలం నుంచి కన్యాకుమారి వరకు... రూ.15,800కే 9 రోజుల యాత్ర... ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీతాజా నిధులతో మరిన్ని కాలేజీలకు చేరుకోవడంతో పాటు ఏఐ, టెక్నాలజీ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను బలోపేతం చేయాలని బైట్‌ఎక్స్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 40 విద్యాసంస్థల్లో ఉన్న సంస్థ, వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 120కి పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం 2 లక్షల మంది విద్యార్థులకు అందుతున్న సేవలను 15 రాష్ట్రాల్లో 5 లక్షల మంది విద్యార్థులకు విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. ఏఐ ఆధారిత లెర్నింగ్, అసెస్‌మెంట్, స్టూడెంట్ అనలిటిక్స్, వ్యక్తిగత అవసరాలకు తగ్గ లెర్నింగ్ టూల్స్ అభివృద్ధిపైనా పెట్టుబడి పెట్టనుంది.బైట్‌ఎక్స్‌ఎల్ తాజా ఫండింగ్‌కు లోఎస్ట్రో అడ్వైజర్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా వ్యవహరించింది. దీనికి ముందు 2024 జూలైలో సంస్థ 5.9 మిలియన్ డాలర్ల సిరీస్-ఏ ఫండింగ్‌ను సమీకరించింది. తాజా 9 మిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా మరిన్ని ఇంజినీరింగ్ విద్యార్థులకు టెక్నాలజీ, ఏఐ నైపుణ్యాలను అందించి, వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసే తన మోడల్‌ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని బైట్‌ఎక్స్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.

Source link