బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన సన్నిహిత స్నేహితురాలు ఆకాంక్ష రంజన్ కపూర్ వివాహ వేడుకలో పాల్గొన్న జాన్వీ, సంప్రదాయ దుస్తుల్లో రాజకుమార్తెను తలపించేలా కనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె ధరించిన రెడ్-బ్లాక్ లెహంగా, రాజస్థానీ ఆభరణాలు, మినిమల్ మేకప్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

