IndiGo Flight: 17 వేల అడుగుల ఎత్తులో మెరుపు దాడి.. ఇండిగో విమానానికి భారీ నష్టం! |


Last Updated:

17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి ఒక్కసారిగా మెరుపు తాకినట్లు సమాచారం.. కానీ అసలు విషయం ల్యాండింగ్ తర్వాతే బయటపడింది. ఇంతకీ గాల్లో ఏం జరిగింది? విమానం ఎందుకు నిలిపివేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

IndiGo Flight: పాట్నా నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానానికి గాల్లో అనూహ్య ఘటన ఎదురైంది. 6E925 విమానం ప్రయాణిస్తున్న సమయంలో మెరుపు తాకినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంపై మెరుపు పడినట్లు తెలుస్తోంది. దీంతో విమానం ముందు భాగంలోని నోస్ ర్యాడమ్ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రయాణం మధ్యలో విమానం దెబ్బతిన్న విషయాన్ని పైలట్లు గుర్తించలేకపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానం మెరుపును ఎదుర్కొందా అనే అంశాన్ని అధికారులు ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. అయితే మెరుపు కారణంగానే నష్టం జరిగిందని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు.

104 మంది ప్రయాణికులు సురక్షితం

ఇండిగోకు చెందిన 6E925 విమానం బుధవారం పాట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. విమానంలో 104 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం లక్నోలోని చౌధరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో సాధారణంగా చేరుకుంది. మరో సమాచారం ప్రకారం, విమానం 4.12 గంటలకు ల్యాండ్ అయింది. నిర్ణీత సమయానికి ఎనిమిది నిమిషాల ముందుగానే విమానం చేరుకున్నట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడలేదు. ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి గాయాలు కూడా నమోదు కాలేదు.

పార్కింగ్ సమయంలో బయటపడిన నష్టం

విమానం రన్‌వేపై సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులను దించారు. అనంతరం విమానాన్ని నిర్ణీత పార్కింగ్ ప్రాంతానికి తరలిస్తుండగా దాని ముందు భాగం దెబ్బతిన్నట్లు విమానాశ్రయ సిబ్బంది గుర్తించారు. ఈ విమానం టెయిల్ రిజిస్ట్రేషన్ VT-IQZతో ఉన్న ఎయిర్‌బస్ A320-251Nగా అధికారులు తెలిపారు. ఘటనపై ఇండిగోకు సమాచారం అందించడంతో విమానాన్ని ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్’గా ప్రకటించి అక్కడే నిలిపివేశారు.

నోస్ ర్యాడమ్‌కు నష్టం

విమానంలోని ముందు భాగంలో ఉండే నోస్ ర్యాడమ్ వాతావరణ రాడార్‌ను రక్షించే నిర్మాణం. విమానానికి మెరుపు తాకిన సమయంలో ఈ భాగం దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. పైలట్లు మెరుపు తాకిన విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేసినట్లు సమాచారం. అయితే దాని వల్ల విమానానికి ఇంతటి నష్టం జరిగిందని వారు భావించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సాంకేతిక తనిఖీ పూర్తయ్యే వరకు విమానం నేలపైనే

ఘటనపై డీజీసీఏకు సమాచారం అందించారు. విమానాన్ని పూర్తిస్థాయిలో సాంకేతికంగా పరిశీలించిన తర్వాత అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానం లక్నోలోనే ఉంటుంది. డీజీసీఏ నుంచి తప్పనిసరి అనుమతులు పొందిన తర్వాతే తిరిగి విమాన సేవలకు ఉపయోగించనున్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు ముగిసిన అనంతరం మరిన్ని సాంకేతిక వివరాలను ఇండిగో వెల్లడించనుందని ఓ అధికారి తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 October 2026, 6:11 am Digital Edition : Prabhanews
IndiGo Flight: 17 వేల అడుగుల ఎత్తులో మెరుపు దాడి.. ఇండిగో విమానానికి భారీ నష్టం! |

Last Updated:Oct 08, 2026 6:11 AM IST17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి ఒక్కసారిగా మెరుపు తాకినట్లు సమాచారం.. కానీ అసలు విషయం ల్యాండింగ్ తర్వాతే బయటపడింది. ఇంతకీ గాల్లో ఏం జరిగింది? విమానం ఎందుకు నిలిపివేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
News18IndiGo Flight: పాట్నా నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానానికి గాల్లో అనూహ్య ఘటన ఎదురైంది. 6E925 విమానం ప్రయాణిస్తున్న సమయంలో మెరుపు తాకినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంపై మెరుపు పడినట్లు తెలుస్తోంది. దీంతో విమానం ముందు భాగంలోని నోస్ ర్యాడమ్ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రయాణం మధ్యలో విమానం దెబ్బతిన్న విషయాన్ని పైలట్లు గుర్తించలేకపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానం మెరుపును ఎదుర్కొందా అనే అంశాన్ని అధికారులు ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. అయితే మెరుపు కారణంగానే నష్టం జరిగిందని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు.104 మంది ప్రయాణికులు సురక్షితంఇండిగోకు చెందిన 6E925 విమానం బుధవారం పాట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. విమానంలో 104 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం లక్నోలోని చౌధరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో సాధారణంగా చేరుకుంది. మరో సమాచారం ప్రకారం, విమానం 4.12 గంటలకు ల్యాండ్ అయింది. నిర్ణీత సమయానికి ఎనిమిది నిమిషాల ముందుగానే విమానం చేరుకున్నట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడలేదు. ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి గాయాలు కూడా నమోదు కాలేదు.
A flight from Indian airline IndiGo got struck by lightning mid-air, causing severe damage to the plane's nose.
However, not only did they land at their destination safely, they got there 8 minutes early despite the turbulence. https://t.co/rHWlVvcpTj— Pubity (@pubity) October 7, 2026పార్కింగ్ సమయంలో బయటపడిన నష్టంవిమానం రన్‌వేపై సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులను దించారు. అనంతరం విమానాన్ని నిర్ణీత పార్కింగ్ ప్రాంతానికి తరలిస్తుండగా దాని ముందు భాగం దెబ్బతిన్నట్లు విమానాశ్రయ సిబ్బంది గుర్తించారు. ఈ విమానం టెయిల్ రిజిస్ట్రేషన్ VT-IQZతో ఉన్న ఎయిర్‌బస్ A320-251Nగా అధికారులు తెలిపారు. ఘటనపై ఇండిగోకు సమాచారం అందించడంతో విమానాన్ని ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్’గా ప్రకటించి అక్కడే నిలిపివేశారు.నోస్ ర్యాడమ్‌కు నష్టంవిమానంలోని ముందు భాగంలో ఉండే నోస్ ర్యాడమ్ వాతావరణ రాడార్‌ను రక్షించే నిర్మాణం. విమానానికి మెరుపు తాకిన సమయంలో ఈ భాగం దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. పైలట్లు మెరుపు తాకిన విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేసినట్లు సమాచారం. అయితే దాని వల్ల విమానానికి ఇంతటి నష్టం జరిగిందని వారు భావించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.సాంకేతిక తనిఖీ పూర్తయ్యే వరకు విమానం నేలపైనేఘటనపై డీజీసీఏకు సమాచారం అందించారు. విమానాన్ని పూర్తిస్థాయిలో సాంకేతికంగా పరిశీలించిన తర్వాత అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానం లక్నోలోనే ఉంటుంది. డీజీసీఏ నుంచి తప్పనిసరి అనుమతులు పొందిన తర్వాతే తిరిగి విమాన సేవలకు ఉపయోగించనున్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు ముగిసిన అనంతరం మరిన్ని సాంకేతిక వివరాలను ఇండిగో వెల్లడించనుందని ఓ అధికారి తెలిపారు.మరింత చదవండి

Source link