ప్రభన్యూస్

House Purchase: పాత ఇల్లు కొనేముందు ఈ 7 డాక్యుమెంట్స్ చూసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడతారు | బిజినెస్


1. ప్రాపర్టీ పత్రాలు

మొట్టమొదటగా ఇంటికి సంబంధించిన పత్రాలు (టైటిల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు) క్షుణ్ణంగా పరిశీలించాలి. విక్రయిస్తున్న వ్యక్తికే ఆ ఆస్తిపై పూర్తి హక్కు ఉందా? లేక వారసుల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా? అనేది చూడాలి. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) తీసి ఆ ఆస్తిపై ఎలాంటి బ్యాంకు రుణాలు, తనఖాలు, కోర్టు కేసులు లేవని నిర్ధారించుకోవాలి. ప్రాపర్టీ లాయర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం సురక్షితం.

2. పాత బకాయిలు

ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులు, అపార్ట్మెంట్ అయితే మెయింటెనెన్స్ ఛార్జీలు పాత యజమాని పూర్తిగా చెల్లించారో లేదో చూడాలి. లేకపోతే ఆ బకాయిల భారం కొత్త యజమానిపై పడుతుంది. సంబంధిత అసోసియేషన్ లేదా సొసైటీని సంప్రదించి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), బకాయిల క్లియరెన్స్ తీసుకోవాలి.

3. నిర్మాణం, ఇంటి కండిషన్

కొత్త రంగులు, ఫర్నిచర్ చూసి మోసపోవద్దు. భవనం స్ట్రక్చరల్ కండిషన్ ఎలా ఉందో నిశితంగా గమనించాలి. గోడలకు పగుళ్లు, పైకప్పుకు నీటి లీకేజీలు, చెమ్మ ఉన్నాయేమో చూడాలి. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేస్తున్నాయో లేదో బేరీజు వేసుకోవాలి. అవసరమైతే ప్రొఫెషనల్ సివిల్ ఇంజనీర్ లేదా హోమ్ ఇన్స్పెక్టర్ సహాయం తీసుకోవడం ఉత్తమం.

4. మున్సిపల్ అనుమతులు

పాత యజమాని ఇంట్లో ఏమైనా అదనపు నిర్మాణాలు (బాల్కనీ మూసివేయడం, గదుల పెంపు, గోడల తొలగింపు) చేశారా? వాటికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లాంటి సంబంధిత మున్సిపల్ అధికారుల నుంచి సరైన అనుమతి ఉందా? లేదా అనేది చెక్ చేయాలి. అనుమతి లేని అక్రమ నిర్మాణాలు ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వ అధికారుల నుంచి కూల్చివేతల ప్రమాదం, పెనాల్టీల బెడద ఉంటుంది.

5. సేల్ అగ్రిమెంట్  

మౌఖిక మాటల కంటే రాతపూర్వక ఒప్పందమే ముఖ్యం. కొనుగోలు ఒప్పందం (Sale Agreement) పై సంతకం చేసే ముందు అందులోని నిబంధనలను చదవాలి. ఆస్తి తుది ధర, చెల్లింపు గడువు, ఇంటిని స్వాధీనం (Possession) చేసుకునే తేదీ, ఇంటితో పాటు వచ్చే ఫిక్చర్స్ వివరాలు అందులో స్పష్టంగా పొందుపరచాలి. ఏదైనా క్లాజ్ అర్థం కాకపోతే న్యాయవాది సలహా తీసుకోవాలి.

6. భవన వయసు, పరిసరాలు

కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఆ భవనం వయసు ఎంత, కామన్ ఏరియాల నిర్వహణ, లిఫ్ట్ కండిషన్, పార్కింగ్ సదుపాయం, భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూడాలి. చుట్టుపక్కల వాతావరణం, ట్రాఫిక్, శబ్ద కాలుష్యం, రవాణా సదుపాయాలు తెలుసుకోవడానికి వేర్వేరు సమయాల్లో (ఉదయం, సాయంత్రం, రాత్రి) ఆ ప్రాంతాన్ని సందర్శించాలి.

7. ఖర్చుల అంచనా

ఇంటి ధరే తుది ఖర్చు కాదు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కమిషన్, లీగల్ ఫీజులు, రిపేర్లు, పాత ఇంటి మోడిఫికేషన్, హౌస్ షిఫ్టింగ్ ఖర్చులు వంటివన్నీ కలుపుకుంటేనే అసలు బడ్జెట్ ఎంతనేది తెలుస్తుంది. ఈ ఖర్చులన్నింటినీ ముందే లెక్కించుకుంటే ఆర్థిక ప్రణాళిక గాడి తప్పకుండా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 2:13 pm Digital Edition : Prabhanews
House Purchase: పాత ఇల్లు కొనేముందు ఈ 7 డాక్యుమెంట్స్ చూసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడతారు | బిజినెస్

1. ప్రాపర్టీ పత్రాలుమొట్టమొదటగా ఇంటికి సంబంధించిన పత్రాలు (టైటిల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు) క్షుణ్ణంగా పరిశీలించాలి. విక్రయిస్తున్న వ్యక్తికే ఆ ఆస్తిపై పూర్తి హక్కు ఉందా? లేక వారసుల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా? అనేది చూడాలి. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) తీసి ఆ ఆస్తిపై ఎలాంటి బ్యాంకు రుణాలు, తనఖాలు, కోర్టు కేసులు లేవని నిర్ధారించుకోవాలి. ప్రాపర్టీ లాయర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం సురక్షితం.2. పాత బకాయిలుఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులు, అపార్ట్మెంట్ అయితే మెయింటెనెన్స్ ఛార్జీలు పాత యజమాని పూర్తిగా చెల్లించారో లేదో చూడాలి. లేకపోతే ఆ బకాయిల భారం కొత్త యజమానిపై పడుతుంది. సంబంధిత అసోసియేషన్ లేదా సొసైటీని సంప్రదించి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), బకాయిల క్లియరెన్స్ తీసుకోవాలి.3. నిర్మాణం, ఇంటి కండిషన్కొత్త రంగులు, ఫర్నిచర్ చూసి మోసపోవద్దు. భవనం స్ట్రక్చరల్ కండిషన్ ఎలా ఉందో నిశితంగా గమనించాలి. గోడలకు పగుళ్లు, పైకప్పుకు నీటి లీకేజీలు, చెమ్మ ఉన్నాయేమో చూడాలి. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేస్తున్నాయో లేదో బేరీజు వేసుకోవాలి. అవసరమైతే ప్రొఫెషనల్ సివిల్ ఇంజనీర్ లేదా హోమ్ ఇన్స్పెక్టర్ సహాయం తీసుకోవడం ఉత్తమం.4. మున్సిపల్ అనుమతులుపాత యజమాని ఇంట్లో ఏమైనా అదనపు నిర్మాణాలు (బాల్కనీ మూసివేయడం, గదుల పెంపు, గోడల తొలగింపు) చేశారా? వాటికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లాంటి సంబంధిత మున్సిపల్ అధికారుల నుంచి సరైన అనుమతి ఉందా? లేదా అనేది చెక్ చేయాలి. అనుమతి లేని అక్రమ నిర్మాణాలు ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వ అధికారుల నుంచి కూల్చివేతల ప్రమాదం, పెనాల్టీల బెడద ఉంటుంది.5. సేల్ అగ్రిమెంట్  మౌఖిక మాటల కంటే రాతపూర్వక ఒప్పందమే ముఖ్యం. కొనుగోలు ఒప్పందం (Sale Agreement) పై సంతకం చేసే ముందు అందులోని నిబంధనలను చదవాలి. ఆస్తి తుది ధర, చెల్లింపు గడువు, ఇంటిని స్వాధీనం (Possession) చేసుకునే తేదీ, ఇంటితో పాటు వచ్చే ఫిక్చర్స్ వివరాలు అందులో స్పష్టంగా పొందుపరచాలి. ఏదైనా క్లాజ్ అర్థం కాకపోతే న్యాయవాది సలహా తీసుకోవాలి.6. భవన వయసు, పరిసరాలుకేవలం ఇల్లు మాత్రమే కాదు, ఆ భవనం వయసు ఎంత, కామన్ ఏరియాల నిర్వహణ, లిఫ్ట్ కండిషన్, పార్కింగ్ సదుపాయం, భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూడాలి. చుట్టుపక్కల వాతావరణం, ట్రాఫిక్, శబ్ద కాలుష్యం, రవాణా సదుపాయాలు తెలుసుకోవడానికి వేర్వేరు సమయాల్లో (ఉదయం, సాయంత్రం, రాత్రి) ఆ ప్రాంతాన్ని సందర్శించాలి.7. ఖర్చుల అంచనాఇంటి ధరే తుది ఖర్చు కాదు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కమిషన్, లీగల్ ఫీజులు, రిపేర్లు, పాత ఇంటి మోడిఫికేషన్, హౌస్ షిఫ్టింగ్ ఖర్చులు వంటివన్నీ కలుపుకుంటేనే అసలు బడ్జెట్ ఎంతనేది తెలుస్తుంది. ఈ ఖర్చులన్నింటినీ ముందే లెక్కించుకుంటే ఆర్థిక ప్రణాళిక గాడి తప్పకుండా ఉంటుంది.

Source link