Last Updated:
Hi-Tech Engineers IPO: హైడ్రాలిక్ ఫిట్టింగ్‌ల తయారీ సంస్థ హై-టెక్ ఇంజనీర్స్ IPOకు ఇన్వెస్టర్లు భారీగా స్పందించారు. రూ.135.73 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా వచ్చిన ఈ ఇష్యూ చివరి రోజు నాటికి ఏకంగా 244.41 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. సెప్టెంబర్ 1న BSE, NSEలో షేర్లు లిస్ట్ కానుండటంతో లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది.
హైడ్రాలిక్ ఫిట్టింగ్‌ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన హై-టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కు పెట్టుబడిదారుల నుండి విశేషమైన స్పందన లభించింది. గురువారం బిడ్డింగ్ ముగిసే సమయానికి ఈ ఐపీఓ ఏకంగా 244.41 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. దలాల్ స్ట్రీట్‌లో ఇటీవల వచ్చిన ఆఫరింగ్‌లలో అత్యంత డిమాండ్ సాధించిన ఐపీఓల్లో ఒకటిగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.

