ప్రభన్యూస్

Heroine: ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ పరంగా టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. రష్మిక మందన్న స్థానం ఎంతో తెలుసా..? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్టార్ డమ్ కు కొలమానం సోషల్ మీడియా అయింది. వాళ్ళ పాపులారిటీని బట్టి భారీ రేంజ్ ఫాలోవర్స్ వస్తున్నారు. మరి ఇప్పుడున్న హీరోయిన్లలో ఫాలోయింగ్ పరంగా ఉన్న టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ చూద్దామా..

News18
News18

ఒకప్పుడు సినిమా తారల పాపులారాటీని వారు నటించిన సినిమాలు, సాధించిన బాక్సాఫీస్ హిట్లు, థియేటర్ల వద్ద అభిమానుల సందడి మరియు కటౌట్లు ఆధారంగా లెక్కించేవారు. కానీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు స్టార్ డమ్ కు కొలమానం సోషల్ మీడియాగా మారింది. అందులోనూ ప్రత్యేకంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తారలకు ఉన్న ఫాలోయింగ్ వారి మార్కెట్ స్థాయిని, క్రేజ్ ను డిసైడ్ చేస్తోంది. బ్రాండ్ ఎండార్స్ మెంట్లు కూడా ఈ ఫాలోవర్ల సంఖ్య ఆధారంగానే వస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన టాప్-10 హీరోయిన్ల జాబితా ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను వెనక్కి నెట్టి మరీ ఓ బాలీవుడ్ బ్యూటీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ జాబితాలో ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ చిత్రాలతో పాపులర్ అయి, ఇటీవల ‘స్త్రీ 2’ సాలిడ్ హిట్ తో దూసుకెళ్తున్న శ్రద్ధా కపూర్ ఏకంగా 94 మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా, సాధారణ సెల్ఫీలు, పెంపుడు జంతువులు, ఇంటి భోజనానికి సంబంధించిన పోస్టులతో ఆమె సాధించిన ఈ విజయం విశేషమనే చెప్పాలి. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా 93 మిలియన్ల ఫాలోవర్స్ తో రెండో స్థానంలో నిలిచింది. నటనతో పాటు ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ 86 మిలియన్ల ఫాలోవర్స్ తో మూడో స్థానంలో నిలిచి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది.

గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన దీపికా పదుకొణె 81 మిలియన్ల ఫాలోవర్స్ తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ‘కల్కి 2898 AD’, ‘జవాన్’ వంటి భారీ చిత్రాలతో మెప్పించిన ఆమె, ఆస్కార్ నుంచి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వరకు భారతీయ సినిమాను రిప్రజెంట్ చేసింది. ఐదో స్థానంలో ఉన్న కత్రినా కైఫ్ తన ఫిట్ నెస్, బ్యూటీ సీక్రెట్స్, డ్యాన్స్ వీడియోలతో అభిమానులను నిరంతరం ఎంగేజ్ చేస్తూ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ, ఫిట్ నెస్ ప్రమోషన్లతో ఫ్యాన్స్ కి చేరువగా ఉంటున్న అనుష్క శర్మ 69 మిలియన్ల ఫాలోవర్స్ తో ఆరో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఏడో స్థానంలో నిలిచిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 66 మిలియన్ల ఫాలోవర్స్ తో డ్యాన్స్, గ్లామరస్ వీడియోలతో సందడి చేస్తోంది. ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్న దిశా పటాని 61 మిలియన్ల ఫాలోవర్స్ తో తన యాక్షన్ వర్కౌట్స్, హాట్ ఫోటోషూట్లతో సాలిడ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

తొమ్మిదో స్థానంలో ఉన్న కృతి సనన్ 59 మిలియన్ల ఫాలోవర్స్ తో ఫ్యాషన్, ట్రావెల్ పోస్టులతో అలరిస్తోంది. ఇక చివరిగా పదో స్థానంలో నిలిచిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా 51.5 మిలియన్ల ఫాలోవర్స్ తో దక్షిణాది నుంచి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న ఏకైక కథానాయకిగా రికార్డు సృష్టించింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 July 2026, 12:10 am Digital Edition : Prabhanews
Heroine: ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ పరంగా టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. రష్మిక మందన్న స్థానం ఎంతో తెలుసా..? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 30, 2026 5:58 PM ISTప్రస్తుత డిజిటల్ యుగంలో స్టార్ డమ్ కు కొలమానం సోషల్ మీడియా అయింది. వాళ్ళ పాపులారిటీని బట్టి భారీ రేంజ్ ఫాలోవర్స్ వస్తున్నారు. మరి ఇప్పుడున్న హీరోయిన్లలో ఫాలోయింగ్ పరంగా ఉన్న టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ చూద్దామా.. News18ఒకప్పుడు సినిమా తారల పాపులారాటీని వారు నటించిన సినిమాలు, సాధించిన బాక్సాఫీస్ హిట్లు, థియేటర్ల వద్ద అభిమానుల సందడి మరియు కటౌట్లు ఆధారంగా లెక్కించేవారు. కానీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు స్టార్ డమ్ కు కొలమానం సోషల్ మీడియాగా మారింది. అందులోనూ ప్రత్యేకంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తారలకు ఉన్న ఫాలోయింగ్ వారి మార్కెట్ స్థాయిని, క్రేజ్ ను డిసైడ్ చేస్తోంది. బ్రాండ్ ఎండార్స్ మెంట్లు కూడా ఈ ఫాలోవర్ల సంఖ్య ఆధారంగానే వస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన టాప్-10 హీరోయిన్ల జాబితా ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను వెనక్కి నెట్టి మరీ ఓ బాలీవుడ్ బ్యూటీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ జాబితాలో 'ఆషికి 2', 'ఏక్ విలన్' చిత్రాలతో పాపులర్ అయి, ఇటీవల 'స్త్రీ 2' సాలిడ్ హిట్ తో దూసుకెళ్తున్న శ్రద్ధా కపూర్ ఏకంగా 94 మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా, సాధారణ సెల్ఫీలు, పెంపుడు జంతువులు, ఇంటి భోజనానికి సంబంధించిన పోస్టులతో ఆమె సాధించిన ఈ విజయం విశేషమనే చెప్పాలి. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా 93 మిలియన్ల ఫాలోవర్స్ తో రెండో స్థానంలో నిలిచింది. నటనతో పాటు ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ 86 మిలియన్ల ఫాలోవర్స్ తో మూడో స్థానంలో నిలిచి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది.గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన దీపికా పదుకొణె 81 మిలియన్ల ఫాలోవర్స్ తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 'కల్కి 2898 AD', 'జవాన్' వంటి భారీ చిత్రాలతో మెప్పించిన ఆమె, ఆస్కార్ నుంచి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వరకు భారతీయ సినిమాను రిప్రజెంట్ చేసింది. ఐదో స్థానంలో ఉన్న కత్రినా కైఫ్ తన ఫిట్ నెస్, బ్యూటీ సీక్రెట్స్, డ్యాన్స్ వీడియోలతో అభిమానులను నిరంతరం ఎంగేజ్ చేస్తూ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది.సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ, ఫిట్ నెస్ ప్రమోషన్లతో ఫ్యాన్స్ కి చేరువగా ఉంటున్న అనుష్క శర్మ 69 మిలియన్ల ఫాలోవర్స్ తో ఆరో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఏడో స్థానంలో నిలిచిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 66 మిలియన్ల ఫాలోవర్స్ తో డ్యాన్స్, గ్లామరస్ వీడియోలతో సందడి చేస్తోంది. ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్న దిశా పటాని 61 మిలియన్ల ఫాలోవర్స్ తో తన యాక్షన్ వర్కౌట్స్, హాట్ ఫోటోషూట్లతో సాలిడ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.తొమ్మిదో స్థానంలో ఉన్న కృతి సనన్ 59 మిలియన్ల ఫాలోవర్స్ తో ఫ్యాషన్, ట్రావెల్ పోస్టులతో అలరిస్తోంది. ఇక చివరిగా పదో స్థానంలో నిలిచిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా 51.5 మిలియన్ల ఫాలోవర్స్ తో దక్షిణాది నుంచి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న ఏకైక కథానాయకిగా రికార్డు సృష్టించింది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link