Hair In Ear: సనాతన భారతీయ సంప్రదాయంలో శరీర లక్షణాల ఆధారంగా ఒక వ్యక్తి భవిష్యత్తును, స్వభావాన్ని, మానసిక స్థితిని అంచనా వేసే ప్రాచీన విజ్ఞానమే ‘సాముద్రిక శాస్త్రం’ అని ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు ప్రశాంత్ వివరిస్తున్నారు. హస్తరేఖలు, ముఖ వర్చస్సు, కనుబొమ్మల తీరు లాగే శరీరంలోని వివిధ భాగాలపై కనిపించే మార్పులకు కూడా శాస్త్రంలో లోతైన వివరణలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ లేదా హార్మోన్ల ప్రభావం వల్ల చాలామంది పురుషులలో చెవులపై వెంట్రుకలు రావడం సహజం. అయితే దీనిని కేవలం ఒక శారీరక మార్పుగా మాత్రమే కాకుండా, అరుదైన అదృష్ట సూచికగా సాముద్రిక శాస్త్రం పరిగణిస్తుందని తెలుపుతున్నారు. చెవులపై వెంట్రుకలు ఉండే వ్యక్తుల వ్యక్తిత్వం, ఆయుష్షు, ఆరోగ్యానికి సంబంధించి శాస్త్రం వెల్లడిస్తున్న ఆ 5 ప్రధాన రహస్యాల పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

