Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు (ఆగస్టు 6) బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దేశంలో బంగారానికి రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలు, పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌తో దేశీయంగా పసిడి గత రెండు రోజుల్లో భారీగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గురువారం నాటి ట్రేడింగ్‌లో బంగారం భారీగా పెరగ్గా.. వెండి స్వల్పంగా తగ్గింది. పారిశ్రామిక రంగానికి తోడు రక్షణాత్మక పెట్టుబడిగా డిమాండ్ పుంజుకోవడమే ఈ రేట్ల రాలీకి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్ ధరలు భారీగా పెరిగాయి.
ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,48,003 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.510 పెరిగింది. ఇక సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,27,300 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.284 తగ్గింది.
ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం పెరిగితే.. వెండి తగ్గింది. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.320 పెరిగి రూ.1,49,100కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,36,675 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం తగ్గాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.360 స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,27,990 వద్ద కొనసాగుతోంది.
Hyderabad,Telangana

