ప్రభన్యూస్

Gold Purity Check: బంగారం కొనేవారికి కేంద్రం బిగ్ అలర్ట్.. అందులో కల్తీ ఉందో లేదో ఇలా తెలుసుకోండి! | బిజినెస్


Last Updated:

Gold Purity Check: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయని నగలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తక్కువ ధరకు బంగారం దొరుకుతుందనే ఆశతో కొనుగోలు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా తగ్గుతున్నాయి. 14 నెలల కనిష్ఠానికి బంగారం ధరలు పడిపోవడంతో చాలా మంది నగలు కొనడానికి ఆశక్తి చూపిస్తున్నారు. దీన్నే అదునుగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. అయితే మీరు ధరలు తగ్గడంతో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్. ఎందుకంటే బంగారం స్వచ్ఛతను పెంచకుండా, కేవలం బరువు పెంచేందుకు కొన్ని ప్రత్యేక లోహాలను కలుపుతున్నారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రేనియం, ఇరిడియం వంటి లోహాలను బంగారంలో కలుపుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీనిపై అప్రమత్తమైన ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) బంగారం కొనేవారికి కీలక సూచనలు చేసింది. బంగారం కొనుగోలు చేసే ముందు BIS కేర్ యాప్ ద్వారా హాల్‌మార్క్ వివరాలను తనిఖీ చేసుకోవాలని కోరింది.

ఈ వ్యవహారంపై ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) దృష్టికి తీసుకెళ్లినట్లు GJC నవంబర్ 20న తెలిపింది. నగల వ్యాపారులు కూడా తమ నాణ్యతా తనిఖీలను మరింత కఠినతరం చేయాలని సూచించింది. వినియోగదారులు గుర్తింపు ఉన్న, నమ్మకమైన నగల దుకాణాల్లోనే ఆభరణాలు కొనుగోలు చేయాలని పేర్కొంది. కొనుగోలు చేసిన ప్రతిసారీ జీఎస్టీతో కూడిన బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.

BIS కేర్ యాప్‌తో ఏం తెలుసుకోవచ్చంటే?

బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించుకోవడానికి BIS కేర్ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులోని ‘Verify HUID’ ఆప్షన్ ద్వారా ఆభరణంపై ఉన్న ఆరు అంకెల ప్రత్యేక HUID నంబర్‌ను ఎంటర్ చేస్తే దాని పూర్తి వివరాలు వస్తాయి. ఈ నంబర్ ప్రతి హాల్‌మార్క్ ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయిస్తారు. దీని ద్వారా ఆ ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్క్ వివరాలు, ప్రకటించిన బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు. సాధారణంగా బంగారు ఆభరణంపై BIS లోగో, స్వచ్ఛత గుర్తు, HUID నంబర్ ఉంటాయి. ఉదాహరణకు 22K916 అని ఉంటే అందులో 22 క్యారెట్ల బంగారం ఉందని, ప్రతి 1,000 భాగాల్లో 916 భాగాలు అంటే 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉందని అర్థం. మిగిలిన భాగాల్లో ఇతర లోహాలు ఉంటాయి.

రేనియం, ఇరిడియంను యాప్ గుర్తించగలదా?

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. BIS కేర్ యాప్‌లో HUID నంబర్‌ను తనిఖీ చేసినంత మాత్రాన ఆభరణంలో రేనియం, ఇరిడియం లేదా ఇతర లోహాలు ఉన్నాయో లేదో తెలియదు. ఈ యాప్ కేవలం హాల్‌మార్క్ వివరాలను మాత్రమే ధృవీకరిస్తుంది. ఆభరణంలోని లోహాల కూర్పును పరీక్షించే సదుపాయం ఇందులో లేదు. కాబట్టి బంగారంలో కల్తీ జరిగిందని అనుమానం ఉంటే ప్రత్యేకంగా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

బంగారాన్ని ఎక్కడ టెస్ట్ చేయాలి?

వినియోగదారులు BIS గుర్తింపు పొందిన అసెయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్లలో (AHC) తమ బంగారు ఆభరణాలను పరీక్షించుకోవచ్చు. ఇందుకోసం నిర్ణీత రుసుము చెల్లించాలి. BIS నిబంధనల ప్రకారం IS 1418 ప్రమాణం కింద ఫైర్ అసే పద్ధతిలో బంగారం స్వచ్ఛత పరీక్షించేందుకు రూ.200 ఫీజు నిర్ణయించారు. పరీక్ష పూర్తయిన తర్వాత కేంద్రం ఆభరణానికి సంబంధించిన వివరాలతో అసే రిపోర్ట్ ఇవ్వాలి. అయితే రేనియం, ఇరిడియం వంటి నిర్దిష్ట లోహాలను కూడా గుర్తించాలనుకుంటే, ఆ పరీక్ష అందుబాటులో ఉందో లేదో ముందుగానే కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలి.

తక్కువ క్యారెట్లు ఉంటే ఏం చేయాలి?

కొన్నిసార్లు ఆభరణంపై 22 క్యారెట్లు అని పేర్కొన్నప్పటికీ, పరీక్షలో అంతకంటే తక్కువ స్వచ్ఛత ఉన్నట్లు తేలవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులకు BIS నిబంధనల ప్రకారం పరిహారం పొందే అవకాశం ఉంది. ప్రకటించిన స్వచ్ఛతకు, పరీక్షలో తేలిన స్వచ్ఛతకు మధ్య ఉన్న వ్యత్యాసం, ఆభరణం బరువు ఆధారంగా లెక్కించిన మొత్తానికి రెట్టింపు పరిహారంతో పాటు పరీక్ష ఛార్జీలను కూడా పొందవచ్చు.

అలాగే నకిలీ హాల్‌మార్క్‌లు, BIS గుర్తును దుర్వినియోగం చేయడం లేదా తప్పుడు నాణ్యతా వివరాలు ఇవ్వడం వంటి వాటిపై BIS కేర్ యాప్‌లోని ఫిర్యాదుల విభాగం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత రసీదు, ప్రత్యేక ఫిర్యాదు నంబర్ లభిస్తాయి. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు తీసుకోవడంతో పాటు HUID నంబర్‌ను తనిఖీ చేసుకోవడం, అనుమానం ఉంటే గుర్తింపు పొందిన కేంద్రంలో పరీక్ష చేయించుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 November 2026, 6:50 pm Digital Edition : Prabhanews
Gold Purity Check: బంగారం కొనేవారికి కేంద్రం బిగ్ అలర్ట్.. అందులో కల్తీ ఉందో లేదో ఇలా తెలుసుకోండి! | బిజినెస్

Last Updated:Nov 23, 2026 4:09 PM ISTGold Purity Check: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయని నగలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తక్కువ ధరకు బంగారం దొరుకుతుందనే ఆశతో కొనుగోలు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది.
ప్రతీకాత్మక చిత్రంగత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా తగ్గుతున్నాయి. 14 నెలల కనిష్ఠానికి బంగారం ధరలు పడిపోవడంతో చాలా మంది నగలు కొనడానికి ఆశక్తి చూపిస్తున్నారు. దీన్నే అదునుగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. అయితే మీరు ధరలు తగ్గడంతో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్. ఎందుకంటే బంగారం స్వచ్ఛతను పెంచకుండా, కేవలం బరువు పెంచేందుకు కొన్ని ప్రత్యేక లోహాలను కలుపుతున్నారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రేనియం, ఇరిడియం వంటి లోహాలను బంగారంలో కలుపుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీనిపై అప్రమత్తమైన ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) బంగారం కొనేవారికి కీలక సూచనలు చేసింది. బంగారం కొనుగోలు చేసే ముందు BIS కేర్ యాప్ ద్వారా హాల్‌మార్క్ వివరాలను తనిఖీ చేసుకోవాలని కోరింది.ఈ వ్యవహారంపై ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) దృష్టికి తీసుకెళ్లినట్లు GJC నవంబర్ 20న తెలిపింది. నగల వ్యాపారులు కూడా తమ నాణ్యతా తనిఖీలను మరింత కఠినతరం చేయాలని సూచించింది. వినియోగదారులు గుర్తింపు ఉన్న, నమ్మకమైన నగల దుకాణాల్లోనే ఆభరణాలు కొనుగోలు చేయాలని పేర్కొంది. కొనుగోలు చేసిన ప్రతిసారీ జీఎస్టీతో కూడిన బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.BIS కేర్ యాప్‌తో ఏం తెలుసుకోవచ్చంటే?బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించుకోవడానికి BIS కేర్ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులోని 'Verify HUID' ఆప్షన్ ద్వారా ఆభరణంపై ఉన్న ఆరు అంకెల ప్రత్యేక HUID నంబర్‌ను ఎంటర్ చేస్తే దాని పూర్తి వివరాలు వస్తాయి. ఈ నంబర్ ప్రతి హాల్‌మార్క్ ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయిస్తారు. దీని ద్వారా ఆ ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్క్ వివరాలు, ప్రకటించిన బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు. సాధారణంగా బంగారు ఆభరణంపై BIS లోగో, స్వచ్ఛత గుర్తు, HUID నంబర్ ఉంటాయి. ఉదాహరణకు 22K916 అని ఉంటే అందులో 22 క్యారెట్ల బంగారం ఉందని, ప్రతి 1,000 భాగాల్లో 916 భాగాలు అంటే 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉందని అర్థం. మిగిలిన భాగాల్లో ఇతర లోహాలు ఉంటాయి.రేనియం, ఇరిడియంను యాప్ గుర్తించగలదా?ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. BIS కేర్ యాప్‌లో HUID నంబర్‌ను తనిఖీ చేసినంత మాత్రాన ఆభరణంలో రేనియం, ఇరిడియం లేదా ఇతర లోహాలు ఉన్నాయో లేదో తెలియదు. ఈ యాప్ కేవలం హాల్‌మార్క్ వివరాలను మాత్రమే ధృవీకరిస్తుంది. ఆభరణంలోని లోహాల కూర్పును పరీక్షించే సదుపాయం ఇందులో లేదు. కాబట్టి బంగారంలో కల్తీ జరిగిందని అనుమానం ఉంటే ప్రత్యేకంగా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.బంగారాన్ని ఎక్కడ టెస్ట్ చేయాలి?వినియోగదారులు BIS గుర్తింపు పొందిన అసెయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్లలో (AHC) తమ బంగారు ఆభరణాలను పరీక్షించుకోవచ్చు. ఇందుకోసం నిర్ణీత రుసుము చెల్లించాలి. BIS నిబంధనల ప్రకారం IS 1418 ప్రమాణం కింద ఫైర్ అసే పద్ధతిలో బంగారం స్వచ్ఛత పరీక్షించేందుకు రూ.200 ఫీజు నిర్ణయించారు. పరీక్ష పూర్తయిన తర్వాత కేంద్రం ఆభరణానికి సంబంధించిన వివరాలతో అసే రిపోర్ట్ ఇవ్వాలి. అయితే రేనియం, ఇరిడియం వంటి నిర్దిష్ట లోహాలను కూడా గుర్తించాలనుకుంటే, ఆ పరీక్ష అందుబాటులో ఉందో లేదో ముందుగానే కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలి.తక్కువ క్యారెట్లు ఉంటే ఏం చేయాలి?కొన్నిసార్లు ఆభరణంపై 22 క్యారెట్లు అని పేర్కొన్నప్పటికీ, పరీక్షలో అంతకంటే తక్కువ స్వచ్ఛత ఉన్నట్లు తేలవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులకు BIS నిబంధనల ప్రకారం పరిహారం పొందే అవకాశం ఉంది. ప్రకటించిన స్వచ్ఛతకు, పరీక్షలో తేలిన స్వచ్ఛతకు మధ్య ఉన్న వ్యత్యాసం, ఆభరణం బరువు ఆధారంగా లెక్కించిన మొత్తానికి రెట్టింపు పరిహారంతో పాటు పరీక్ష ఛార్జీలను కూడా పొందవచ్చు.అలాగే నకిలీ హాల్‌మార్క్‌లు, BIS గుర్తును దుర్వినియోగం చేయడం లేదా తప్పుడు నాణ్యతా వివరాలు ఇవ్వడం వంటి వాటిపై BIS కేర్ యాప్‌లోని ఫిర్యాదుల విభాగం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత రసీదు, ప్రత్యేక ఫిర్యాదు నంబర్ లభిస్తాయి. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు తీసుకోవడంతో పాటు HUID నంబర్‌ను తనిఖీ చేసుకోవడం, అనుమానం ఉంటే గుర్తింపు పొందిన కేంద్రంలో పరీక్ష చేయించుకోవడం మంచిది.మరింత చదవండి

Source link