వంటగదిలో వెల్లుల్లి పక్కా ఉంటుంది. కూరలు, పప్పులు, చట్నీలు వంటి వంటకాల్లో వెల్లుల్లి తాలింపు వేస్తే రుచి, వాసన మరింత పెరుగుతాయి. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని కూడా భావిస్తారు. అందుకే చాలామంది వెల్లుల్లిని ఒకేసారి ఎక్కువగా కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటారు. అయితే కొద్ది రోజుల్లోనే వెల్లుల్లి కుళ్లిపోవడం, ఎండిపోవడం లేదా మొలకలు రావడం జరుగుతుంది. మరి వెల్లుల్లి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి?

