ప్రభన్యూస్

Free Laptop Scheme: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా? అసలు నిజం ఇదే! | బిజినెస్


Last Updated:

PIB Fact Check: ‘నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ స్కీమ్ పూర్తిగా నకిలీదని, అందులోని లింక్‌లపై క్లిక్ చేయడం లేదా వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం ప్రమాదకరమని ప్రజలను హెచ్చరించింది.

News18
News18

‘నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026’ పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోందంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌లో ఇచ్చిన లింక్ ద్వారా నమోదు చేసుకుంటే ఉచిత ల్యాప్‌టాప్ లభిస్తుందని పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది.

PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, ‘నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026’ పేరుతో భారత ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సందేశం పూర్తిగా నకిలీదని, ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో భాగమని పేర్కొంది. ఇటువంటి సందేశాలను నమ్మవద్దని, వాటిలో ఉన్న లింక్‌లపై క్లిక్ చేయవద్దని కూడా హెచ్చరించింది.

ఇలాంటి సందేశాల ప్రధాన ఉద్దేశం ప్రజల వ్యక్తిగత, విద్యా, ఆర్థిక సమాచారాన్ని సేకరించడమేనని PIB హెచ్చరించింది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేర్లను ఉపయోగించి నకిలీ వెబ్‌సైట్‌లు రూపొందిస్తారు. ఆ వెబ్‌సైట్‌లలో పేరు, మొబైల్ నంబర్, చిరునామా, విద్యార్హతలు, బ్యాంకు వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయించే ప్రయత్నం చేస్తారు. ఈ సమాచారాన్ని తర్వాత మోసాలకు ఉపయోగించే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

వైరల్ మెసేజ్‌లో ఏముంది?

ఈ నకిలీ సందేశం తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది పలుమార్లు వాట్సాప్‌లో మళ్లీ మళ్లీ వైరల్ అవుతోంది. “Students Laptops Support 2026” అనే శీర్షికతో ఉన్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌కు సంబంధించిన లింక్‌ను ఇందులో జత చేశారు. ఆ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 9.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫారమ్‌లో దరఖాస్తుదారులను పూర్తి పేరు, విద్యార్హత, చదువుతున్న కోర్సు, ఇష్టపడే ల్యాప్‌టాప్ బ్రాండ్ వంటి వివరాలను నమోదు చేయాలని కోరుతున్నారు. ఇవన్నీ అధికారిక ప్రభుత్వ ప్రక్రియలో భాగం కాదని, ప్రజలను మోసం చేయడానికే రూపొందించిన ఫిషింగ్ వెబ్‌సైట్‌లో భాగమని PIB స్పష్టం చేసింది.

ఈ నకిలీ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇప్పటికే పలుమార్లు స్పందించింది. జనవరి 12న News On AIR ద్వారా కూడా ఈ సందేశం పూర్తిగా స్కామ్‌లో భాగమని స్పష్టం చేసింది. అప్పటి నుంచి తన అధికారిక X (ట్విటర్) ఖాతా ద్వారా కూడా అనేకసార్లు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకుండా, ముందుగా అధికారిక వనరుల ద్వారా ధృవీకరించుకోవాలని సూచిస్తోంది.

తెలియని లింక్‌లపై క్లిక్ చేయొద్దు..

ప్రభుత్వం పేరుతో వచ్చే ప్రతి సందేశం నిజమని భావించకూడదని PIB సూచించింది. ముఖ్యంగా తెలియని వెబ్‌సైట్ లింక్‌లపై క్లిక్ చేయడం, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇలాంటి లింక్‌లు ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు తీసుకెళ్లే అవకాశం ఉండటంతో, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా, నిజానిజాలు తెలుసుకోకుండా ఇటువంటి సందేశాలను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఏ ప్రభుత్వ పథకం గురించిన సమాచారం అయినా సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మాత్రమే ధృవీకరించుకోవాలని సూచించింది.

అనుమానాస్పద సందేశాలను ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలు, నకిలీ ప్రకటనలు లేదా మోసపూరిత లింక్‌లు కనిపిస్తే, వాటిని PIB Fact Check బృందానికి పంపించి నిజానిజాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ నంబర్ +91 8799711259 లేదా ఈమెయిల్ factcheck@pib.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. PIB మరోసారి స్పష్టం చేసిన విషయం ఏమిటంటే.. ‘నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్‌టాప్ పథకాన్ని ప్రకటించలేదు. కాబట్టి ఇలాంటి సందేశాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ధృవీకరణ లేకుండా ఎలాంటి వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని ప్రజలకు సూచించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 12:06 am Digital Edition : Prabhanews
Free Laptop Scheme: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా? అసలు నిజం ఇదే! | బిజినెస్

Last Updated:Jul 20, 2026 1:02 PM ISTPIB Fact Check: 'నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ స్కీమ్ పూర్తిగా నకిలీదని, అందులోని లింక్‌లపై క్లిక్ చేయడం లేదా వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం ప్రమాదకరమని ప్రజలను హెచ్చరించింది.
News18'నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026' పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోందంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌లో ఇచ్చిన లింక్ ద్వారా నమోదు చేసుకుంటే ఉచిత ల్యాప్‌టాప్ లభిస్తుందని పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది.PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, 'నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026' పేరుతో భారత ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సందేశం పూర్తిగా నకిలీదని, ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో భాగమని పేర్కొంది. ఇటువంటి సందేశాలను నమ్మవద్దని, వాటిలో ఉన్న లింక్‌లపై క్లిక్ చేయవద్దని కూడా హెచ్చరించింది.ఇలాంటి సందేశాల ప్రధాన ఉద్దేశం ప్రజల వ్యక్తిగత, విద్యా, ఆర్థిక సమాచారాన్ని సేకరించడమేనని PIB హెచ్చరించింది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేర్లను ఉపయోగించి నకిలీ వెబ్‌సైట్‌లు రూపొందిస్తారు. ఆ వెబ్‌సైట్‌లలో పేరు, మొబైల్ నంబర్, చిరునామా, విద్యార్హతలు, బ్యాంకు వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయించే ప్రయత్నం చేస్తారు. ఈ సమాచారాన్ని తర్వాత మోసాలకు ఉపయోగించే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
💻 Free laptops for students?
A WhatsApp message is circulating claiming that the Government is accepting applications for free laptops under the ‘National Student Laptop Scheme 2026’.#PIBFactCheck:❌ This claim is FAKE.✅ The Government of India has NOT announced any such… pic.twitter.com/Xrhn6NLsXh— PIB Fact Check (@PIBFactCheck) July 19, 2026వైరల్ మెసేజ్‌లో ఏముంది?ఈ నకిలీ సందేశం తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది పలుమార్లు వాట్సాప్‌లో మళ్లీ మళ్లీ వైరల్ అవుతోంది. "Students Laptops Support 2026" అనే శీర్షికతో ఉన్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌కు సంబంధించిన లింక్‌ను ఇందులో జత చేశారు. ఆ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 9.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫారమ్‌లో దరఖాస్తుదారులను పూర్తి పేరు, విద్యార్హత, చదువుతున్న కోర్సు, ఇష్టపడే ల్యాప్‌టాప్ బ్రాండ్ వంటి వివరాలను నమోదు చేయాలని కోరుతున్నారు. ఇవన్నీ అధికారిక ప్రభుత్వ ప్రక్రియలో భాగం కాదని, ప్రజలను మోసం చేయడానికే రూపొందించిన ఫిషింగ్ వెబ్‌సైట్‌లో భాగమని PIB స్పష్టం చేసింది.ఈ నకిలీ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇప్పటికే పలుమార్లు స్పందించింది. జనవరి 12న News On AIR ద్వారా కూడా ఈ సందేశం పూర్తిగా స్కామ్‌లో భాగమని స్పష్టం చేసింది. అప్పటి నుంచి తన అధికారిక X (ట్విటర్) ఖాతా ద్వారా కూడా అనేకసార్లు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకుండా, ముందుగా అధికారిక వనరుల ద్వారా ధృవీకరించుకోవాలని సూచిస్తోంది.తెలియని లింక్‌లపై క్లిక్ చేయొద్దు..ప్రభుత్వం పేరుతో వచ్చే ప్రతి సందేశం నిజమని భావించకూడదని PIB సూచించింది. ముఖ్యంగా తెలియని వెబ్‌సైట్ లింక్‌లపై క్లిక్ చేయడం, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇలాంటి లింక్‌లు ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు తీసుకెళ్లే అవకాశం ఉండటంతో, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా, నిజానిజాలు తెలుసుకోకుండా ఇటువంటి సందేశాలను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఏ ప్రభుత్వ పథకం గురించిన సమాచారం అయినా సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మాత్రమే ధృవీకరించుకోవాలని సూచించింది.అనుమానాస్పద సందేశాలను ఎక్కడ ఫిర్యాదు చేయాలి?ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలు, నకిలీ ప్రకటనలు లేదా మోసపూరిత లింక్‌లు కనిపిస్తే, వాటిని PIB Fact Check బృందానికి పంపించి నిజానిజాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ నంబర్ +91 8799711259 లేదా ఈమెయిల్ factcheck@pib.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. PIB మరోసారి స్పష్టం చేసిన విషయం ఏమిటంటే.. 'నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్‌టాప్ పథకాన్ని ప్రకటించలేదు. కాబట్టి ఇలాంటి సందేశాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ధృవీకరణ లేకుండా ఎలాంటి వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని ప్రజలకు సూచించింది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link