Last Updated:
FAST-DS: చిన్న పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్-డీఎస్’ (FAST-DS – Foreign Assets of Small Taxpayers-Disclosure Scheme) నిబంధనలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) శనివారం నోటిఫై చేసింది.
ఈ పథకం కింద ఆన్‌లైన్ డిక్లరేషన్లు దాఖలు చేయడానికి 2026 డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది. పీటీఐ కథనం ప్రకారం.. ఈ పథకం 2026 ఆగస్టు 16 నుంచి అమల్లోకి రానుంది. 2026-27 బడ్జెట్‌లో విద్యార్థులు, యువ నిపుణులు, టెక్ ఉద్యోగులు, తిరిగి భారత్‌కు వచ్చిన ఎన్నారైలు (Relocated NRIs) వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఈ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు.

