ప్రభుత్వం ఈ సాగుకు భారీగా సబ్సిడీలు అందిస్తోందని హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర తెలిపారు. కిసాన్ నర్సరీ ద్వారా మొక్కల పెంపకానికి యూనిట్ విలువ లక్షా యాభై వేల రూపాయలు కాగా అందులో కేంద్రం 75 వేలు, రాష్ట్రం 37,500 రూపాయలు ఇస్తుండగా, రైతు వాటా కేవలం 37,500 రూపాయలు ఉంటుంది. రెండెకరాల మల్బరీ సాగుకు జనరల్ రైతులకు కేంద్రం 60 వేలు, రాష్ట్రం 30 వేలు సబ్సిడీ భరిస్తే రైతు 30 వేలు పెట్టుకోవాలి. అదే ఎస్సీ, ఎస్టీ రైతులకు కేంద్రం ఏకంగా 78 వేలు ఇస్తుండగా రైతు సొంత వాటా పన్నెండు వేలు మాత్రమే.
