రెనాల్ట్ గ్రూప్ ఇండియా రెనాల్ట్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ విక్రమన్ వెల్లండి మాట్లాడుతూ, ట్రైబర్ 100PS అభివృద్ధి అంటే కేవలం కొత్త పవర్‌ట్రెయిన్‌ను జోడించడం కాదని చెప్పారు. 100 పీఎస్ పవర్, 180 ఎన్ఎం టార్క్‌తో పాటు ట్రైబర్‌లోని మాడ్యులారిటీ, సౌకర్యం, ఇంధన సామర్థ్యాన్ని కొనసాగించేందుకు ఇంజిన్, థర్మల్ మేనేజ్మెంట్, స్ట్రక్చర్, సస్పెన్షన్, బ్రేకింగ్, వెహికల్ డైనమిక్స్ సిస్టమ్స్ అన్నీ కలిసి పనిచేసేలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ట్రైబర్ ఎనర్జీ ఎంటీ వేరియంట్లో ఆథెంటిక్ ధర రూ.5,80,875. ఎవల్యూషన్ ధర రూ.6,73,605. టెక్నో ధర రూ.7,44,120. ఎమోషన్ ధర రూ.8,05,350గా ఉంది. ఎనర్జీ ఏఎంటీ వేరియంట్ ఎమోషన్లో రూ.8,52,950 ధరకు అందుబాటులో ఉంది. టర్బో టీసీఈ 100 ఎంటీ వేరియంట్లో ఎవల్యూషన్ ధర రూ.7,84,900. టెక్నో ధర రూ.8,53,900. ఎమోషన్ ధర రూ.8,99,900గా ఉంది. వేరియంట్‌ను బట్టి ఫీచర్లు, పరికరాల్లో మార్పులు ఉండొచ్చు. (image: Renault India)

