రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా పెన్షన్ అందుకోవాలనుకునే ఈపీఎఫ్ఓ సభ్యులకు 10 ఏళ్ల అర్హత ఉన్న సర్వీస్ చాలా కీలకం. ఈ కనీస సర్వీస్ పూర్తయ్యేలోపు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తే పెన్షన్ అర్హతపై ప్రభావం పడొచ్చని ఈపీఎఫ్ఓ గుర్తు చేసింది. అందుకే పీఎఫ్ విత్‌డ్రాయల్, స్కీమ్ సర్టిఫికెట్, సర్వీస్ కొనసాగింపు, రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి సభ్యులు తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అర్హత ఉన్న సభ్యులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల అర్హత ఉన్న సర్వీస్ పూర్తి చేయాలని సూచించింది. కనీస సర్వీస్ పూర్తయ్యే ముందు ప్రావిడెంట్ ఫండ్‌లో ఉన్న డబ్బును విత్‌డ్రా చేస్తే పెన్షన్ అర్హత దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రతి సభ్యుడి ఈపీఎఫ్ఓ ఖాతాకు వర్తించే నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయడం ద్వారా ఇప్పుడు వచ్చే ఆర్థిక సమస్యకు పరిష్కారం దొరికినా, దాని ప్రభావం రిటైర్మెంట్ తర్వాత చాలా కాలం ఉండొచ్చు అని హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల. ఆయన న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

