ధరల విషయానికి వస్తే స్మార్ట్ 30 రూ.9.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్మార్ట్+ 30 రూ.10.39 లక్షలు, స్మార్ట్+ 40 రూ.11.19 లక్షలు, అడ్వెంచర్ 40 రూ.11.94 లక్షలు, ఎంపవర్డ్ 40 రూ.12.69 లక్షలు, ఎంపవర్డ్+ ఎస్ 40 రూ.12.99 లక్షలుగా ఉన్నాయి. హైయర్ వేరియంట్లలో పెద్ద డిస్ప్లేలు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, ప్రీమియం సీట్లు, సన్రూఫ్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి. పంచ్ ఈవీ ఫియర్లెస్ ఎల్లో, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే, బెంగాల్ రూజ్, ప్రిస్టీన్ వైట్, కారమెల్, సూపర్నోవా కాపర్ వంటి రంగుల్లో లభిస్తుంది. కొన్ని వేరియంట్లలో డ్యూయల్-టోన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్టీ, కనెక్టెడ్ టెక్నాలజీ, ఎస్యూవీ డిజైన్, కంఫర్ట్ ఫీచర్లను కలిపి పంచ్ ఈవీని రూపొందించారు. (image: Tata Cars)

