Dhanush: ధనుష్ ‘ఓం’ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ ఇదే! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓం’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

News18
News18

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓం’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ‘ఓం’ చిత్రానికి సంబంధించి మేకర్స్‌ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ.. తాజాగా నవంబర్ 20కి విడుదల తేదీని మార్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త రిలీజ్‌ డేట్‌తో కూడిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ధనుష్‌, మమ్ముట్టి అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

‘ఓం’ చిత్రంలో ధనుష్‌, మమ్ముట్టితో పాటు సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో భారీ యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. గతంలో ‘అమరన్’ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘అమరన్’ చిత్రానికి గాను ఆయన ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. దీంతో ఆయన దర్శకత్వంలో ధనుష్‌, మమ్ముట్టి వంటి ఇద్దరు అగ్ర నటులు కలిసి నటిస్తుండటంతో ‘ఓం’పై అంచనాలు మరింత పెరిగాయి.

వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్‌, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఆర్. కలైవానన్ ఎడిటర్‌గా, కె. ఎళిల్ అరసు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు, భారీ నిర్మాణ విలువలు, అగ్ర నటీనటుల కలయిక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

‘ఓం’ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో తొలి భాగాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. దీంతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. ముఖ్యంగా ధనుష్‌కు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉండటం, మమ్ముట్టికి అన్ని భాషల్లోనూ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉండటంతో ‘ఓం’కు దేశవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్‌ దక్కే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

ఇక సాయిపల్లవికి కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుంది. వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న ఆమె.. ‘ఓం’తో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోవైపు ఆమె నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సాయిపల్లవి అభిమానులకు వరుసగా భారీ చిత్రాలు తెరపైకి రానున్నాయి. మొత్తంగా ధనుష్‌, మమ్ముట్టి కాంబినేషన్‌, భారీ యాక్షన్‌ నేపథ్యం, స్టార్‌ కాస్ట్‌, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న కథతో ‘ఓం’పై ఆసక్తి కొనసాగుతోంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 20కి విడుదల వాయిదా పడటంతో.. కొత్త తేదీన ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 10:12 pm Digital Edition : Prabhanews
Dhanush: ధనుష్ ‘ఓం’ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ ఇదే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 02, 2026 10:04 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓం’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.News18కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓం’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ‘ఓం’ చిత్రానికి సంబంధించి మేకర్స్‌ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ.. తాజాగా నవంబర్ 20కి విడుదల తేదీని మార్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త రిలీజ్‌ డేట్‌తో కూడిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ధనుష్‌, మమ్ముట్టి అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.‘ఓం’ చిత్రంలో ధనుష్‌, మమ్ముట్టితో పాటు సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో భారీ యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. గతంలో ‘అమరన్’ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘అమరన్’ చిత్రానికి గాను ఆయన ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. దీంతో ఆయన దర్శకత్వంలో ధనుష్‌, మమ్ముట్టి వంటి ఇద్దరు అగ్ర నటులు కలిసి నటిస్తుండటంతో ‘ఓం’పై అంచనాలు మరింత పెరిగాయి.వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్‌, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఆర్. కలైవానన్ ఎడిటర్‌గా, కె. ఎళిల్ అరసు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు, భారీ నిర్మాణ విలువలు, అగ్ర నటీనటుల కలయిక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.‘ఓం’ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో తొలి భాగాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. దీంతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. ముఖ్యంగా ధనుష్‌కు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉండటం, మమ్ముట్టికి అన్ని భాషల్లోనూ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉండటంతో ‘ఓం’కు దేశవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్‌ దక్కే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.ఇక సాయిపల్లవికి కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుంది. వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న ఆమె.. ‘ఓం’తో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోవైపు ఆమె నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సాయిపల్లవి అభిమానులకు వరుసగా భారీ చిత్రాలు తెరపైకి రానున్నాయి. మొత్తంగా ధనుష్‌, మమ్ముట్టి కాంబినేషన్‌, భారీ యాక్షన్‌ నేపథ్యం, స్టార్‌ కాస్ట్‌, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న కథతో ‘ఓం’పై ఆసక్తి కొనసాగుతోంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 20కి విడుదల వాయిదా పడటంతో.. కొత్త తేదీన ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.మరింత చదవండి

Source link