సీతాఫలం.. పేరు వింటేనే ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎప్పుడు తింటామా? అనిపిస్తుంది. తియ్యగా ఉండే పండు మాత్రమే కాదు.. ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్-సి, విటమిన్-బి6, పీచు పదార్థం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. సీతాఫలంలో ఉండే పీచు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడవచ్చు.

