మరోవైపు, భారత్‌లోని కోకా-కోలా బాట్లింగ్ కంపెనీల్లో కనీసం ఒకటి పరిమిత కాలం పాటు చిన్న 200 మిల్లీలీటర్ల గాజు సీసాల్లో డైట్ కోక్‌ను విక్రయించడం ప్రారంభించింది. అయితే ఆ సీసాల ధర క్యాన్లలో లభించే డైట్ కోక్ కంటే చాలా ఎక్కువగా ఉందని ఆన్‌లైన్ లిస్టింగ్స్, ఈ విషయం గురించి తెలిసిన మరో వ్యక్తి తెలిపారు. కోకా-కోలా, పెప్సీకి భారత్ కీలకమైన వృద్ధి మార్కెట్‌గా ఉంది. డైట్ కోక్ మినహా వీటి ఇతర పానీయాలు ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు సీసాలు, క్యాన్లలో అమ్ముడవుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వినియోగదారుల మధ్య డైట్ కోక్ భారత్‌లో బాగా ఆదరణ పొందింది. కోకా-కోలా భారత్‌లో క్యాలరీలు లేని కోక్ జీరోను కూడా విక్రయిస్తోంది. అయితే దాని సరఫరాకు పెద్దగా ప్రమాదం లేదు, ఎందుకంటే అది ప్లాస్టిక్ బాటిళ్లు, క్యాన్లు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

