చికెన్ కర్రీలో ఆల్ స్పైస్ పొడి వేస్తే.. కొన్ని మసాలా దినుసులు వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. దీనికి సహజమైన ఘాటు, సువాసన ఉంటాయి. అందువల్ల దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, మిరియాల పొడిని వాడాల్సిన అవసరం ఉండదు. ఈ దినుసుల రుచులు, ఘాటు, సువాసన అన్నీ.. ఈ ఆల్‌స్పైస్ పొడి ద్వారానే లభిస్తాయి. అదే దీని ప్రత్యేకత. కొంతమంది ఆల్‌స్పైస్ పొడితోపాటూ.. కొద్దిగా మిరియాల పొడి కూడా వాడతారు. అది ఆప్షనల్. వాడకపోయినా పర్వాలేదు.

