ప్రభన్యూస్

ChatGPT: టీనేజర్ల కోసం స్పెషల్ చాట్‌జీపీటీ… హోమ్‌వర్క్ నుంచి స్కూల్ వర్క్ వరకు ఇక ఈజీ! | ChatGPT for Teens Launches With New Safeguards | బిజినెస్


Last Updated:

ఓపెన్‌ఏఐ టీనేజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చాట్‌జీపీటీ వెర్షన్‌ను తీసుకొస్తోంది. కృత్రిమ మేధస్సుతో చిన్నప్పటి నుంచే పెరుగుతున్న కొత్త తరం టీనేజర్లు ఇప్పటికే స్కూల్ పనులు, రోజువారీ జీవితంపై సందేహాలు, కొన్ని సందర్భాల్లో తోడుగా మాట్లాడుకోవడం కోసం కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. అందుకే వారి వయసుకు తగ్గట్టుగా మరింత సురక్షితంగా ఉండేలా ఈ కొత్త వెర్షన్‌ను రూపొందించారు.

ChatGPT: టీనేజర్ల కోసం స్పెషల్ చాట్‌జీపీటీ... హోమ్‌వర్క్ నుంచి స్కూల్ వర్క్ వరకు ఇక ఈజీ! (ప్రతీకాత్మక చిత్రం)
ChatGPT: టీనేజర్ల కోసం స్పెషల్ చాట్‌జీపీటీ… హోమ్‌వర్క్ నుంచి స్కూల్ వర్క్ వరకు ఇక ఈజీ! (ప్రతీకాత్మక చిత్రం)

శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్‌ఏఐ మంగళవారం ‘చాట్‌జీపీటీ ఫర్ టీన్స్’ను ప్రారంభిస్తోంది. ఇది 13 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారని అసోసియేటెడ్ ప్రెస్ కథనం వెల్లడించింది. ఆత్మహత్య, స్వీయహాని, రొమాంటిక్ లేదా లైంగిక సంభాషణలు వంటి అంశాలపై మరింత కఠినమైన కంటెంట్ పరిమితులు ఇందులో ఉంటాయి. హోంవర్క్, చదువులో కూడా ఇది సహాయం చేస్తుంది. అయితే విద్యార్థులకు నేరుగా సమాధానాలు చెప్పడం లేదా స్కూల్ వ్యాసాలను రాసి ఇవ్వడం కాకుండా, వాళ్లే విషయాన్ని అర్థం చేసుకుని సమాధానం కనుక్కునేలా ఈ చాట్‌బాట్ మార్గనిర్దేశం చేస్తుంది. టీన్‌లకు వారి వయసుకు తగిన వాతావరణంలో ఏఐని ఆరోగ్యకరంగా ఉపయోగించడం నేర్పించడమే ఈ ప్రయత్నం లక్ష్యమని ఓపెన్‌ఏఐ తెలిపింది. “టీన్‌లను టీన్‌లుగానే చూడాలి. అంటే వాళ్ల వయసుకు, మానసిక ఎదుగుదలకు తగ్గట్టుగా మాట్లాడాలి. వాళ్లను చిన్న పిల్లల్లా చూడకూడదు. అదే సమయంలో వాళ్లు చూడకూడని విషయాలు వాళ్లకు కనిపించకుండా చూసుకోవాలి” అని ఓపెన్‌ఏఐలో గ్లోబల్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ ఆన్ ఓ’లియరీ చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 5:41 pm Digital Edition : Prabhanews
ChatGPT: టీనేజర్ల కోసం స్పెషల్ చాట్‌జీపీటీ… హోమ్‌వర్క్ నుంచి స్కూల్ వర్క్ వరకు ఇక ఈజీ! | ChatGPT for Teens Launches With New Safeguards | బిజినెస్

Last Updated:Aug 18, 2026 5:30 PM ISTఓపెన్‌ఏఐ టీనేజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చాట్‌జీపీటీ వెర్షన్‌ను తీసుకొస్తోంది. కృత్రిమ మేధస్సుతో చిన్నప్పటి నుంచే పెరుగుతున్న కొత్త తరం టీనేజర్లు ఇప్పటికే స్కూల్ పనులు, రోజువారీ జీవితంపై సందేహాలు, కొన్ని సందర్భాల్లో తోడుగా మాట్లాడుకోవడం కోసం కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. అందుకే వారి వయసుకు తగ్గట్టుగా మరింత సురక్షితంగా ఉండేలా ఈ కొత్త వెర్షన్‌ను రూపొందించారు. ChatGPT: టీనేజర్ల కోసం స్పెషల్ చాట్‌జీపీటీ... హోమ్‌వర్క్ నుంచి స్కూల్ వర్క్ వరకు ఇక ఈజీ! (ప్రతీకాత్మక చిత్రం)శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్‌ఏఐ మంగళవారం 'చాట్‌జీపీటీ ఫర్ టీన్స్'ను ప్రారంభిస్తోంది. ఇది 13 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారని అసోసియేటెడ్ ప్రెస్ కథనం వెల్లడించింది. ఆత్మహత్య, స్వీయహాని, రొమాంటిక్ లేదా లైంగిక సంభాషణలు వంటి అంశాలపై మరింత కఠినమైన కంటెంట్ పరిమితులు ఇందులో ఉంటాయి. హోంవర్క్, చదువులో కూడా ఇది సహాయం చేస్తుంది. అయితే విద్యార్థులకు నేరుగా సమాధానాలు చెప్పడం లేదా స్కూల్ వ్యాసాలను రాసి ఇవ్వడం కాకుండా, వాళ్లే విషయాన్ని అర్థం చేసుకుని సమాధానం కనుక్కునేలా ఈ చాట్‌బాట్ మార్గనిర్దేశం చేస్తుంది. టీన్‌లకు వారి వయసుకు తగిన వాతావరణంలో ఏఐని ఆరోగ్యకరంగా ఉపయోగించడం నేర్పించడమే ఈ ప్రయత్నం లక్ష్యమని ఓపెన్‌ఏఐ తెలిపింది. "టీన్‌లను టీన్‌లుగానే చూడాలి. అంటే వాళ్ల వయసుకు, మానసిక ఎదుగుదలకు తగ్గట్టుగా మాట్లాడాలి. వాళ్లను చిన్న పిల్లల్లా చూడకూడదు. అదే సమయంలో వాళ్లు చూడకూడని విషయాలు వాళ్లకు కనిపించకుండా చూసుకోవాలి" అని ఓపెన్‌ఏఐలో గ్లోబల్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ ఆన్ ఓ'లియరీ చెప్పారు.మరింత చదవండి

Source link