అందుకే సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదించిన సమ్మెను ఒక్క యూనియన్ లేదా ఒక్క బ్యాంకు స్థాయిలో జరిగే సమ్మెగా చూడకూడదు. ఏ యూనియన్లు ఇందులో పాల్గొంటున్నాయి, బ్యాంకు శాఖలు, కార్యాలయాలు తెరిచి ఉంటాయా లేదా అనే అంశాలపై సమ్మె ప్రభావం ఆధారపడి ఉంటుంది. “అయితే ఈ సంఘాల్లో సభ్యుడిగా లేని ఉద్యోగికి సమ్మెలో పాల్గొనాలా వద్దా అనేది నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. అలాంటి ఉద్యోగి విధులకు హాజరైనా, సమ్మె కారణంగా ఆఫీసు మూసి ఉంటే, అతని హాజరును అందుకు అనుగుణంగా నమోదు చేయాలి. ఆ రోజుకు అతని జీతం కట్ చేయకూడదు” అని మిశ్రా చెప్పారు. కొన్ని ప్రత్యేక మినహాయింపులు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి అదే నెలలో రిటైర్ కావాల్సి ఉంటే అతనికి మినహాయింపు ఇవ్వొచ్చు. ఆ రోజులకు జీతం రాకపోతే పెన్షన్‌కు సంబంధించిన లెక్కలపై ప్రభావం పడే అవకాశం ఉండటమే దీనికి కారణం. (ప్రతీకాత్మక చిత్రం)

