Banana Side Effects: అరటిపండు తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను ఇచ్చే ఒక అద్భుతమైన పండు. బరువు పెరగాలనుకునే వారు, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకునే వారు, బాడీ బిల్డర్లు ప్రతిరోజు అరటిపండ్లను తమ డైట్ లో భాగంగా తీసుకుంటారు. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్లు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం.. అరటిపండు అందరి శరీరాలకూ అమృతంలా పనిచేయదు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అరటిపండ్లను అతిగా తింటే.. అవి శరీరంలో సరికొత్త కాంప్లికేషన్లను తెచ్చిపెట్టి ప్రాణాల మీదకు తెస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం.. అసలు ఏయే సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను ముట్టకూడదో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

