అరటిపండు తక్కువ ధరలో లభించే, శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే పండు. బరువు పెరగాలనుకునేవారు, త్వరగా శక్తి పొందాలనుకునేవారు, వ్యాయామం చేసేవారు అరటిపండును తమ ఆహారంలో భాగంగా తీసుకుంటుంటారు. ఇందులో పొటాషియం, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అయితే అరటిపండు అందరికీ ఒకే విధంగా సరిపోదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అరటిపండును ఎక్కువగా తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు డైటీషియన్ డాక్టర్ శ్రీలత. ఎవరు తినకూడదో ఇప్పుడు చూద్దాం.

