Last Updated:
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కెరీర్‌లో 111వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న బాలయ్య.. ఈ ప్రాజెక్ట్ తర్వాత తన కెరీర్‌లో మరో కీలకమైన సినిమాకు రెడీ అవుతున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కెరీర్‌లో 111వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న బాలయ్య.. ఈ ప్రాజెక్ట్ తర్వాత తన కెరీర్‌లో మరో కీలకమైన సినిమాకు రెడీ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో బాలకృష్ణ చేయబోయే NBK112 ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ కావడంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 25న అమరావతిలో ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

