ఏడు దశాబ్దాల నట వైభవం: 1944లో ‘సీతారామ జననం’ సినిమాతో హీరోగా మారిన అక్కినేని, సుమారు 259 చిత్రాల్లో నటించారు. దేవదాసు, లైలా మజ్ను, ప్రేమాభిషేకం వంటి క్లాసిక్స్ నుండి దసరా బుల్లోడు వంటి మాస్ హిట్ వరకు ఆయన ప్రయాణం అప్రతిహతం. భారత ప్రభుత్వం ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. 2014, జనవరి 22న ఈ ధ్రువతార నేలకొరిగినా, ఆయన సినిమాలు, సిద్ధాంతాలు తెలుగు వారి గుండెల్లో నిరంతరం నిలిచే ఉంటాయి. తన జీవితంలో నటన ఒక్కటే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి తెలుగు సినిమాల షూటింగ్స్ కోసం ఓ గొప్ప ప్రదేశాన్ని నెలకొల్పారు. అంతేకాదు పలు వ్యాపారాలతో వేల కోట్లు సంపాదించారు.

