దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అమెజాన్ అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్ను తీసుకుందాం. ఈ ఫోన్ పేజీలో ప్రైస్ హిస్టరీపై ట్యాప్ చేస్తే, రూఫస్ ఏఐ (బీటా)లో గతంలో దాని ధర ఎలా మారిందో చూపించే గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ ఉదాహరణలో ఫోన్ ప్రస్తుత ధర రూ.94,999గా ఉంది. గత 30 రోజుల్లో దీని ధర రూ.89,999 నుంచి రూ.99,999 మధ్యలో ఉంది. ఈ ఫోన్ ఎంఆర్పీ రూ.1,29,999. అంటే ఎంఆర్పీతో పోలిస్తే ప్రస్తుతం లిస్టింగ్ ధర రూ.35,000 తక్కువగా ఉంది. అయితే, గత ధరలను పరిశీలిస్తే మరో విషయం తెలుస్తుంది. గత 30 రోజుల్లో ఈ ఫోన్ ధర కనిష్ఠంగా రూ.89,999కు అందుబాటులో ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న రూ.94,999 ధర, ఆ కనిష్ఠ ధర కంటే రూ.5,000 ఎక్కువ. మీకు ఈ ఫోన్ వెంటనే అవసరం లేకపోతే, కొనుగోలు చేసే ముందు కొంతకాలం ధరను గమనించవచ్చు. (image: Amazon India)

