దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా వండుకునే ఆకుకూరల్లో తోటకూర ముందు వరుసలో ఉంటుంది. తోటకూర పప్పు, వేపుడు, పులుసు ఇలా రకరకాల వంటకాలను ఇష్టంగా తింటుంటారు. కేవలం రుచి మాత్రమే కాదు, ఇందులో విటమిన్ ఏ, సి, ఐరన్, క్యాల్షియం, ఫైబర్ లాంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అందరూ దీన్ని తినకూడదు. కొన్ని నిర్దిష్టమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు తోటకూరను అస్సలు తినకూడదని సీనియర్ డైటీషియన్ ఎస్.స్వాతి హెచ్చరిస్తున్నారు. మరి ఎవరు తోటకూరకు దూరంగా ఉండాలో ఒకసారి చూద్దాం.

