మీరు ఒక ఉద్యోగి అనుకుందాం. ఉదయం ఆఫీసుకి వెళ్లి రాత్రికి వస్తారు. ఇంట్లో చాలా పనులు పెండింగ్ ఉంటాయి. అదే పనిమనిషిని పెట్టుకుంటే.. మీరు వచ్చే సరికి.. అన్ని పనులూ పూర్తై ఉంటాయి. దాంతో మీకు కొంత రిలాక్స్ అయ్యే వీలు కలుగుతుంది. ఇక్కడ పనిమనిషి పనిని.. ఇప్పుడు ఏఐ ఏజెంట్లు చేస్తున్నాయి. అంటే.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఇదివరకు.. రకరకాల ప్రాజెక్టులు, పై చార్టులు, గ్రాఫులు, ఫిల్టర్లు, యానిమేషన్లు, ప్రజంటేషన్లు, కోడింగ్ రాయడం వంటి అన్ని రకాల పనులనూ స్వయంగా చేసేవారు. కానీ ఏఐ వచ్చాక వారి పని చాలా వరకు తగ్గింది. ఏఐ ద్వారా వేగంగా చెయ్యగలిగారు. ఇక ఇప్పుడు ఏఐ ఏజెంట్లు వచ్చేశాయి. ఇవి మొత్తం ప్రపంచాన్నే మార్చేస్తున్నాయి.

