ఇదొక్కటే కాదు, జూలై 10న కూడా 12001 శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో (భోపాల్ నుంచి ఢిల్లీ) ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఆహారం నాణ్యత, పరిమాణంపై సోషల్ మీడియా ద్వారా రైల్వే మంత్రి, ఐఆర్‌సీటీసీ, సంబంధిత అధికారులను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. పూర్తి చార్జీ వసూలు చేస్తున్నప్పటికీ, క్యాటరర్ ఆహారం పరిమాణాన్ని తగ్గించాడని ఆయన ఆరోపించారు. వరుసగా రెండు రోజుల పాటు శతాబ్ది ఆహారంపై వచ్చిన ఫిర్యాదులతో క్యాటరింగ్ వ్యవస్థపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలు ప్రయాణికుల ఆరోగ్యం విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా ఎంత పెద్ద సమస్యగా మారుతుందో గుర్తు చేస్తోంది. నాణ్యమైన ఆహారం అందించడం రైల్వే సేవల్లో కీలక భాగం. అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా కఠిన పర్యవేక్షణ, బాధ్యులపై వేగంగా చర్యలు తీసుకోవడం చాలా అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)

