Last Updated:
సినీ ఇండస్ట్రీలో ఒక హిట్ వస్తే రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతారు, అదే ఒక ప్లాప్ వస్తే ఎదుర్కొనే విమర్శలు, ట్రోల్స్ వారి మానసిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. తాజాగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియా ట్రోల్స్ పై రియాక్ట్ అయింది.
సినీ ఇండస్ట్రీలో ఒక హిట్ వస్తే రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతారు, అదే ఒక ప్లాప్ వస్తే ఎదుర్కొనే విమర్శలు, ట్రోల్స్ వారి మానసిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘కింగ్ ఆఫ్ కోథా’ (King Of Kotha) సినిమా పరాజయం తనను ఎంతలా కుంగదీసిందో ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తాను అవకాశాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

