ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో మధుమేహం (డయాబెటిస్) సాధారణ ఆరోగ్య సమస్యగా మారుతోంది. బయటికి ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ, కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరుగుతుండవచ్చు. అయితే శరీరంలో బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. చాలామంది వాటిని వయసు, అలసట లేదా రోజువారీ జీవనశైలికి సంబంధించిన సాధారణ సమస్యలుగా భావించి పట్టించుకోరు.

