ఐపీఓలో కనీస ఎస్-హెచ్‌ఎన్‌ఐ అలాట్‌మెంట్‌గా చెప్పిన 14 లాట్లు, అంటే 476 షేర్లు పొందిన ఇన్వెస్టర్‌ను తీసుకుంటే లెక్కలు ఇలా ఉన్నాయి. ఒక్కో షేర్‌ను రూ.429 చొప్పున కొనుగోలు చేయడానికి మొత్తం రూ.2,04,204 పెట్టుబడి పెట్టాలి. సెప్టెంబర్ 7న ఒక్కో షేర్ ధర రూ.1,090.05కి చేరడంతో ఆ 476 షేర్ల మొత్తం విలువ సుమారు రూ.5,18,464 అయింది. అంటే రూ.2,04,204 పెట్టుబడిపై సుమారు రూ.3,14,260 అన్‌రియలైజ్డ్ లాభం వచ్చింది. పెట్టుబడిపై రాబడి దాదాపు 154 శాతంగా ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఐపీఓ సమయంలో రూ.2 లక్షలకు కొద్దిగా ఎక్కువ పెట్టిన పెట్టుబడి కొన్ని ట్రేడింగ్ సెషన్లలోనే రూ.5 లక్షలకు పైగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
