Last Updated:
దేశంలోని వివిధ వర్గాల్లో అక్షరాస్యత, విద్యా అవకాశాలను పెంచుతూ కోట్లాది మందికి మెరుగైన జీవనోపాధి, మంచి భవిష్యత్తు కోసం టీసీఎస్ తోడ్పాటు అందిస్తోంది.
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అక్షరాస్యత, డిజిటల్ అందుబాటు, టెక్నాలజీ ఆధారిత విద్య ద్వారా వ్యక్తులు, సమాజాలను సాధికారత కల్పించేందుకు తమ నిబద్ధతను మరోసారి వెల్లడించింది. టీసీఎస్ ప్రపంచ స్థాయిలో ఐటీ సేవలు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ సంస్థగా ఉంది. టీసీఎస్ చేపడుతున్న కార్యక్రమాల్లో టీసీఎస్ లిటరసీ ప్రోగ్రామ్ కీలకంగా ఉంది. డాక్టర్ ఎఫ్.సీ. కోహ్లీ ప్రారంభించిన ఈ కార్యక్రమం 26 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళలు, తగిన విద్యా అవకాశాలు అందని వర్గాల అక్షరాస్యత అవసరాలను తీర్చడంపై ఇది దృష్టి పెడుతోంది. భారత్లో వేగంగా పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వీరు మరింత చురుగ్గా భాగస్వాములు కావడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతోంది.

