ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న పాడేరు ఐటీడీఏ పీవో
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి, ప్రభ న్యూస్ ఆగస్టు 6 :
చింతపల్లి ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పర్యటనలో భాగంగా విచ్చేసిన పాడేరు ఐటీడీఏ పీవో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. చింతపల్లి ప్రజల ఆరాధ్య దైవంగా కొలిచే ముత్యాలమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న పీవోకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారి సన్నిధిలో పీవో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాల మధ్య తీర్థప్రసాదాలు స్వీకరించారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.పూజా కార్యక్రమాల అనంతరం స్థానిక యువకులు, ఆలయ కమిటీ సభ్యులు పీవోను శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రతిమను బహూకరించారు. అనంతరం స్థానిక సమస్యలు, చింతపల్లి ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలు, పర్యటన విశేషాలపై నాయకులు ఐటీడీఏ పీవోతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో చింతపల్లి జనసేన పంచాయతీ అధ్యక్షుడు సుర్ల వీరేంద్రకుమార్, అరకు పార్లమెంటు ఇన్ఛార్జ్ గొర్ల వీర వెంకట్, జనసేన పార్టీ యూత్ అధ్యక్షుడు గాజుల శ్రీను, గెడ్డం నాని, ముసాడ రాము, సుర్ల గోవింద్ తదితర ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


