Last Updated:
Ninnu Kori Serial September 6th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న నిన్ను కోరి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ నిన్ను కోరి సీరియల్లో ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Ninnu Kori Serial September 6th Episode: ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్లో…. ఇంట్లోంచి ఎలాగైనా పారిపోవాలని మాయ, మందర ఒక అబద్ధాన్ని సృష్టించారు. మందరకు అత్యవసరంగా ఊరు వెళ్లాల్సిన పని పడిందని, త్వరగా బస్సు ఎక్కించి వస్తానని చెప్పి బయలుదేరబోయారు. కానీ ఈ హడావుడి చూసిన చంద్ర మనసులో అనుమానం బీజం పడింది. “సడన్‌గా ఊరు వెళ్లడం ఏంటి?” అని సందేహించి, “నేనూ వస్తాను, మందరను బస్సు ఎక్కించి పంపుదాం” అనడంతో మాయ, మందరల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏం చేయాలో పాలుపోక షాక్‌లో ఉండిపోయారు.

