Last Updated:
ఓలా ఎలక్ట్రిక్ డీలర్ భాగస్వాములతో స్టోర్లను ప్రారంభించింది. తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో సేవలు ప్రారంభమయ్యాయి.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను కొనాలనుకునే కస్టమర్లకు ఇకపై మరింత సులభంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ తొలిసారిగా డీలర్ భాగస్వాములతో ప్రారంభించిన స్టోర్లు దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఓలా ఎలక్ట్రిక్ తన నెట్‌వర్క్ పార్టనర్ స్టోర్ల తొలి దశను ప్రారంభించినట్లు ప్రకటించింది. డీలర్లు నిర్వహించే ఈ స్టోర్లు రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఈ స్టోర్లతో ఆయా ప్రాంతాల్లో ఓలా స్కూటర్లు, మోటార్‌సైకిళ్లకు ఉన్న స్థానిక డిమాండ్‌ను అందుకోవడంతో పాటు కంపెనీ తన ఉనికిని మరింత పెంచుకోనుంది. కంపెనీ రిటైల్ వ్యూహంలో ఇది కీలకమైన మార్పుగా చెప్పొచ్చు.

