Last Updated:
టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటైల్స్ బయటకొచ్చాయి.
టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను నవ్వించడానికి మళ్లీ తనకిష్టమైన జానర్లోకి వచ్చేశారు. విభిన్న కథలు, సీరియస్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఈ మధ్యకాలంలో బిజీగా ఉన్న నరేష్, పూర్తి స్థాయి ఫాంటసీ కామెడీతో చేసిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ నేడు (సెప్టెంబర్ 4న) గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టింది. విడుదలకి ముందు జరిగిన ప్రమోషన్స్‌లో అల్లరి నరేష్ ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచారు. అంతేగాక, ఈ సినిమా దర్శకుడు చంద్రమోహన్‌కు పెద్ద హిట్ కావాలని, తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ ఒకప్పుడు పడిన కష్టాలను గుర్తుచేసుకుని మరీ నరేష్ ఎమోషనల్ అయ్యారు.

