గోల్డ్‌మన్ సాక్స్ గతంలో 2026 చివరికి బంగారం ధర 5,400 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైఖరి మరింత కఠినంగా మారడం, వడ్డీ రేట్ల కోతలు ఆలస్యం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని 4,900 డాలర్లకు తగ్గించింది. అంటే ప్రస్తుత అంచనా ప్రకారం 31.1 గ్రాముల ట్రాయ్ ఔన్స్‌కు సుమారు రూ. 4.64 లక్షలు, 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ. 1.49 లక్షలు అన్నమాట. 2027ను పరిశీలిస్తే మాత్రం సంస్థ దీర్ఘకాలికంగా మరింత బుల్లిష్‌గా ఉంది. 5,400 నుంచి 5,600 డాలర్ల మధ్య ధరను అంచనా వేస్తోంది. ప్రస్తుత మారకం విలువతో ఇవి వరుసగా ట్రాయ్ ఔన్స్‌కు సుమారు ₹5.11 లక్షలు, రూ. 5.30 లక్షలు, 10 గ్రాములకు దాదాపు రూ. 1.64 లక్షలు, రూ. 1.70 లక్షలు అవుతాయి.
