Last Updated:
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విడుదలైన కొత్త $1 స్మారక నాణెం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ నాణెంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రించడమే ఇందుకు కారణం. అయితే జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలకు సంబంధించి నాణేలు, పేపర్ కరెన్సీకి అమెరికాలో వేర్వేరు నిబంధనలు ఉండటంతో.. ట్రంప్ బొమ్మ నాణెంపై ఎలా వచ్చింది, $250 నోటుపై మాత్రం ఎందుకు చట్టపరమైన సమస్యలు ఉన్నాయనే చర్చ మొదలైంది.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విడుదల చేసిన కొత్త ఒక డాలర్ స్మారక నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆ నాణెంపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రించడమే. అమెరికా కరెన్సీపై జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని ఉపయోగించవచ్చా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. అయితే నాణేలు, కాగితపు నోట్లకు అమెరికాలో వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

