పండుగల సీజన్ దగ్గరపడుతున్న వేళ అమెజాన్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా తన ఈ-కామర్స్, క్విక్ కామర్స్ కార్యకలాపాలకు మద్దతుగా 1.6 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు బుధవారం తెలిపింది. పండుగల సమయంలో ఆన్లైన్ కొనుగోళ్లు భారీగా పెరగడంతో ఈ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా పండుగల సీజన్ ఈ-కామర్స్, క్విక్ కామర్స్ రంగాలకు మంచి ఊపునిస్తుంది. ఈ సమయంలో వినియోగదారుల ఖర్చులు, ఆర్డర్ల సంఖ్య, లావాదేవీల విలువ పెరుగుతాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, గిఫ్టింగ్, కిరాణా సరుకులు, హోమ్ ప్రొడక్ట్స్ వంటి విభాగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పండుగ ఆఫర్లు, ఇంటి నుంచే సులభంగా కొనుగోలు చేసే సౌకర్యం వల్ల గత కొన్నేళ్లుగా ఆన్లైన్ ట్రాఫిక్, కొనుగోళ్లు మరింత పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

