Last Updated:
వంటింటి బడ్జెట్పై ఒక్కసారిగా భారం పెరిగిందా? కేవలం నెల రోజుల్లోనే నిత్యావసర సరుకుల ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ఉల్లిపాయ ధర ఏకంగా 71%, టమాటా 60% పెరిగినట్లు ధరల చార్ట్ వెల్లడిస్తోంది.
ఇంట్లో ప్రతిరోజూ వంట చేసేందుకు ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరల్లో మార్పులు కుటుంబాల నెలవారీ బడ్జెట్పై నేరుగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బియ్యం, పప్పులు, వంట నూనె, చక్కెరతో పాటు కూరగాయల ధరలు పెరిగితే.. నెలవారీ కిరాణా ఖర్చులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. తాజాగా అందుబాటులో ఉన్న ఓ ధరల చార్ట్లో పలు ముఖ్యమైన వంటింటి సరుకుల ధరలు ఒక్క నెల వ్యవధిలోనే పెరిగినట్లు చూపించారు. ఇందులో ముఖ్యంగా ఉల్లిపాయ, టమాటా ధరల పెరుగుదల భారీగా కనిపిస్తోంది.

