జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్‌లతో పాపులర్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే, ఈ లేడీ గెటప్‌లు వారికి పేరు, డబ్బు తెచ్చిపెట్టినా.. కెరీర్ పరంగా ఒకే మూసలో బందీ అయ్యేలా చేశాయి. చాలామంది దర్శకులు వారిని కేవలం ఆ ఒక్క కోణంలోనే చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి మూసధోరణిని బద్దలు కొడుతూ, తనలోని నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు జబర్దస్త్ కొమురం. ఆయన సినీ, నిజ జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

