Last Updated:
Aadhaar Loan: ఆధార్ కార్డు వివరాలు ఇస్తే చాలు.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రూ.3 లక్షల వరకు రుణం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ‘ప్రధాన మంత్రి రుణ పథకం’ పేరుతో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది. ఇలాంటి లింకులు, మెసేజ్‌లను నమ్మి ఆధార్, బ్యాంక్ వివరాలు, OTPలను షేర్ చేస్తే సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజురోజుకూ నకిలీ ప్రచారాలు, మోసపూరిత ప్రకటనలు ఎక్కవవుతున్నాయి. ముఖ్యంగా ఆకర్షణీయమైన వాగ్దానాలు, సులువైన ఆర్థిక రుణాల పేరిట సామాన్య ప్రజలను ఆకట్టుకునేందుకు సైబర్ మోసగాళ్లు వినూత్న రీతుల్లో నకిలీ పథకాలను సృష్టిస్తున్నారు. ఇలాంటి నకిలీ ప్రభుత్వ పథకాల ప్రచారాల పట్ల పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిస్తోంది.

